KTR: కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేస్తాయా…?

KTR: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అయితే బిఆర్ఎస్ కి, వైసీపీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేటీఆర్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభ్యర్థుల మార్పు విషయం పైన స్పందిస్తూ జగన్ కి మద్దతుగా మాట్లాడారు.

 

కేటీఆర్ ఇటీవల జుహీరాబాద్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చక పోవడమే అంటూ వ్యాఖ్యానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన చాలా వ్యతిరేకత ఉందని వారిని మార్చి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే బిఆర్ఎస్ నెగ్గేదని చెప్పారు. ఈ పని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తామని, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు మార్పు ఉంటుందని పరోక్షంగానే చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్పు పైన తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే 50 నుంచి 60 మంది అభ్యర్థులను మార్చడం, కొత్తవారికి అవకాశం కల్పించడం, స్థానచలనం చేయడం వంటివి చేస్తున్నారు.ఈ అభ్యర్థులు మార్పు పైన రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బిఆర్ఎస్ ఓటమి దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ పని చేస్తున్నారని పలువురు చెబుతున్నారు.

 

ఇదివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు పట్టం కట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలు కూడా ప్రతి కొత్త వారిని కోరుకుంటున్నారు. కొత్త అభ్యర్థి వస్తే ఏదైనా నియోజకవర్గం కొత్తగా మార్పు వస్తుందని భావిస్తున్నట్లు రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు. ఇదే దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -