Blind Man: చూపు లేకపోయినా ఈ యువకుడు సాధించిన సక్సెస్ కు ఫిదా కావాల్సిందే!

Blind Man: ఈ రోజుల్లో కొంతమంది మనుషులకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా పనిచేయడానికి కష్టపడడానికి బద్ధకం చూపిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించడం కోసం తప్పుడు మార్గాలని ఎంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది అంగవైకల్యంతో జన్మించిన వారు, కంటి చూపు లేని వారు మంచి మంచి పొజిషన్లకు వెళ్లి అటువంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కూడా ఒకరు.

మామూలుగా కళ్ళు మూసుకుని ఒక 20 అడుగులు వేయమంటేనే ఆచితూచి ఏమైనా అవుతుందేమో అంటూ భయం భయంగా అడుగులు వేస్తూ ఉంటారు. అటువంటిది కంటి చూపు లేని వారు ఎంతో ధైర్యంగా వారి పని వారు చేసుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఒక యువకుడు కంటి చూపు లేకపోయినా కూడా కలలను సహకారం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యశ్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే గ్లుకోమాతో బాధ పడుతున్న యశ్ 8 సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి కంటి చూపును కోల్పోయాడు.

 

అయితే తనకు లోపం ఉన్నా లక్ష్య సాధనకు ఆ లోపం సమస్య కాకూడదని యశ్ భావించాడు.

ప్రస్తుతం యశ్ వయస్సు 26 సంవత్సరాలు కాగా యశ్ తండ్రి సొనాకియా చిన్న క్యాంటీన్ ను నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ప్రత్యేక పాఠశాలలో ఐదో తరగతి వరకు యశ్ చదువుకున్నాడు. స్క్రీన్ రీడింగ్ అనే సాఫ్ట్ వేర్ సహాయంతో యశ్ 2021 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కోడింగ్ నేర్చుకున్న యశ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. మైక్రోసాఫ్ట్ ఆన్ లైన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూను పూర్తి చేసిన యశ్ ఉద్యోగానికి ఎంపికై విజేతగా నిలిచారు. ప్రస్తుతం బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో యశ్ ఉద్యోగం చేస్తున్నారు. 47 లక్షల రూపాయల ప్యాకేజీతో యశ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం. యశ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. కష్టపడితే కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకోవచ్చని యశ్ నిరూపించాడు. యశ్ సక్సెస్ స్టోరీ కొంతమందికి కన్నీళ్లు పెట్టిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -