Gandeevadhari Arjuna: నాగబాబు కొడుకు పరువు గంగలో కలిసిందిగా.. గాండీవధారి అర్జున మూవీ మొత్తం కలెక్షన్లు ఇవే!

Gandeevadhari Arjuna:  తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా హీరో నాగబాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. కనీసం ఈ సినిమా థియేటర్లో వారం రోజులు కూడా ఆడలేదు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ప్రవీణ్ సత్తారు దర్శకుత్వం ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు వరుణ్ గత చిత్రం గని ఘోరంగా విఫలం అవ్వడంతో ఈ సినిమాను చాలా కసిగా చేశాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడినప్పటికీ తన కష్టం మొత్తం కూడా వృధా అయిపోయింది. హాలీవుడ్ లెవల్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. గ్లోబర్ వార్మింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మహా భారతం వంటి దేశాన్ని కాపాడే క్రమంలో గాండీవం చేపట్టిన అర్జునుడి పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్‌లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అతని కెరీర్‌లో ఇంత చెత్తగాఏ సినిమాకు ఓపెనింగ్‌ రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా షేర్ 1 కోటి వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాకు నైజాం 60 లక్షలు, సీడెడ్ 15లక్షలు, ఆంధ్రా 65 లక్షలు, మొత్తం ఏపీ తెలంగాణలో 1.40 కోట్ల గ్రాస్ రాగా.. 75 లక్షల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల షేర్ వచ్చింది.మొత్తంగా రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.50 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా థియేట్రికల్‌గా రూ. 16.49 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ సినిమాకు థియేట్రికల్‌గా కాకుండా నాన్ థియేట్రికల్‌గా డిజిటల్, శాటిలైట్ రూపేణా వచ్చిన డబ్బులే నిర్మాతకు కొంతలో కొంత ఉపశనమం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -