Gandeevadhari Arjuna: గాండీవధారి అర్జున రివ్యూ.. మెగా హీరో వరుణ్ తేజ్ కు మరో భారీ షాక్ తగిలిందా?

Gandeevadhari Arjuna: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- సాక్షి వైద్య కలిసి నటించిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు అనగా ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. నటీనటీల పనితీరు ఏ విధంగా ఉంది అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

కథ.. అర్జున్ వర్మ(వరుణ్ తేజ్) ఒక బాడీ గార్డ్. హై ప్రొఫైల్ కలిగిన ఇండియన్ మినిస్టర్(నాజర్) కి ఓ గ్యాంగ్ నుండి ప్రమాదం ఉంటుంది. వారి నుండి మినిస్టర్ ని కాపాడడమే వరుణ్ బాధ్యత. మరి అర్జున్ వర్మ తన బాధ్యత ఎలా నెరవేర్చాడు. మినిస్టర్ ని ఎలా కాపాడాడు అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ : యూఎస్ ప్రీమియర్స్ చూసిన క్రిటిక్స్, ఆడియన్స్ మూవీపై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ సినిమా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. ఎలాంటి థ్రిల్స్, ట్విస్ట్స్ లేకుండా ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవని అంటున్నారు నెటిజెన్స్. అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెద్దగా థ్రిల్ చేయలేకపోయాయని అంటున్నారు. ముఖ్యంగా నెరేషన్ చాలా మెల్లగా సాగుతుంది. పోని సెకండ్ హాఫ్ లో బాగుంటుంది అనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని తెలుస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, స్టైలిష్ మేకింగ్ మినహాయిస్తే గాండీవధారి అర్జున చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు.

 

నటీనటుల పనితీరు: సాక్షి వైద్య, నాజర్ పాత్రలు కీలకంగా ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించ లేకపోయారని ట్విట్టర్ టాక్. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.

 

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాసర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమటం
రచన & దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సమర్పణ : బాపినీడు
నిర్మాత: BVSN ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
ఆర్ట్ డైరెక్టర్ : శివ కామేష్ డి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: మిక్కీ జె మేయర్

 

రేటింగ్ 3.25/5.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -