Genelia-Riteish Deshmukh: జెనీలియా ప్రెగ్నెన్సీ వార్తల వెనుక అసలు కథ ఇదేనా.. ఆ సంఖ్య పెరిగినా ఇబ్బంది లేదా!

Genelia-Riteish Deshmukh: సినీ నటి జెనీలియా మరోసారి తల్లి కాబోతోంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈయనతో వివాహమైన తర్వాత జెనీలియా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అనంతరం ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ప్రస్తుతం పిల్లలు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం జెనీలియా కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా అవుతున్నారు ఇలాంటి సమయంలోనే ఈమె మూడోసారి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ వార్త రావడానికి కారణం కూడా లేకపోలేదు జెనీలియా తన భర్తతో కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా జెనీలియా ధరించిన డ్రెస్సులో ఆమెకు బేబీ బంప్ ఉన్నట్లు క్లియర్ గా కనిపించింది దీంతో ప్రెగ్నెంట్ అని అందరూ భావించి ఈ వార్తను వైరల్ చేశారు. ఈ విధంగా జెనీలియా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై జెనీలియా భర్త రితేష్ స్పందించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు.

తనకు మరో ఇద్దరూ లేరా ముగ్గురు పిల్లలు కావాలని చాలా కోరికగా ఉంది. దురదృష్టం ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదు అంటూ ఆయన జెనీలియా గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈ సందర్భంగా చెప్పగానే చెప్పేశారు. జెనీలియా ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమె భర్త స్పందించడంతో ఈ వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పడినట్టు అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -