Warangal district: నిశ్చితార్థం వేడుకకు గ్రాండ్గా ఏర్పాట్లు.. కానీ?

Warangal district: కొడుకు ఎంగేజ్మెంట్ కావడంతో తల్లిదండ్రులు సంతోషంగా ఉండడంతో పాటు బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలని అనుకున్నారు..మరో నాలుగు రోజుల్లో నిశ్చితార్థం ఉండడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దానితో ఒక్కసారిగా దాంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగిందంటే.. వరంగల్ జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో గోనె లెనిన్ రెడ్డి అనే 30 ఏళ్ళ యువకుడు నివాసం ఉంటున్నాడు.

డిగ్రీ పూర్తి చేసి కరీంనగర్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అయితే లెనిన్ కి ఈ నెల 8న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అందు కోసం లెనిన్ మంగళవారమే తన ఇంటికి చేరుకున్నాడు. ఇక బుధవారం తల్లితో పాటు ఎంగేజ్ మెంట్ కోసం మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకున్నాడు. అదేరోజు ఇంట్లో అందరు తిని పడుకున్నారు. లెనిన్ మాత్రం.జీవితంపై విరక్తి కలుగుతుంది. చావాలని అనిపిస్తుంది. అమ్మను బాగా చూసుకో అన్నయ్య అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే లెనిన్ పై తల్లికి ఎందుకో అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూసే ప్రయత్నం చేసింది. కానీ, అతడు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు.

 

దాంతో వెంటనే అతని తల్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అందరూ వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా లెనిన్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. కొడుకుని అలా చూసి తల్లి గుండెలు పగిలేలా రోధించింది. లెనిన్ మరణవార్త తెలుసుకున్న సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో 4 రోజుల్లో ఎంగేజ్ మెంట్ ఉండగానే లెనిన్ రెడ్డి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -