Sridevi: ఆపరేషన్ల విషయంలో శ్రీదేవి రికార్డ్ సృష్టించిందా.. ఏం జరిగిందంటే?

Sridevi: యావత్ భారతదేశాన్ని తన అందచందాలతో ఒక ఊపు ఊపిన నటి ఎవరంటే టక్కున శ్రీదేవి పేరు చెప్తారు సినీ ప్రియులు. ఆమె మూడు దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్ గా ఉండటమే కాకుండా రెండు తరాల నటులతో ఆడి పాడింది. దురదృష్టం కొద్దీ ఈమె ఐదు పదుల వయసులోనే ఆకస్మిక మరణంపాలై కోట్లాదిమంది అభిమానులని కన్నీటి సంద్రంలో ముంచేసింది.

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అంత సులువుగా ఆమెకి విజయం వరించలేదు. అందం, నటన విషయంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ నటి తన ఆహార్యం విషయంలో విమర్శల పాలయింది. అటువంటి సమయంలోనే బోనికపూర్ సోదరులు శ్రీదేవికి సపోర్టుగా నిలబడ్డారు.

వారి కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చేలాగా చేశారు. ఆ అభిమానంతోనే రెండో పెళ్లి వాడైనప్పటికీ బోనీ కపూర్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అనిల్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా బాలీవుడ్లో శ్రీదేవికి తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈమె కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఖుదా గవా ఒకటి.

బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ తో పోటాపోటీగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రీదేవి. తన శరీరంలో ఎక్కువ విమర్శల పాలైన తన ముక్కుని 14 సార్లు ఆపరేషన్ చేయించుకుని రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆపరేషన్ చేయించుకున్న ప్రతిసారి ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ తన కీర్తి కాంక్ష ముందు అవేవీ నిలబడలేకపోయాయి.

సౌత్ ఇండియా నుంచి చాలామంది బాలీవుడ్ వైపు అడుగులు వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ బాలీవుడ్ శ్రీదేవికే కిరీటాన్ని అప్పగించి మహారాణి చేసింది. ఆమె తన కూతుర్లని కూడా తన స్థాయిలోనే చూడాలని ఆశించింది కానీ దురదృష్టం కొద్దీ ఆమె ఆ కోరిక తీరకుండానే చనిపోవడం విచారకరం.

ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. చూడాలి మరి తల్లి స్థానాన్ని చేరుకుంటుందో, లేదో. ఈమె తెలుగులో కూడా త్వరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించబోతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -