Ajwain Leaves: ర‌క్తం మొత్తాన్ని ఫిల్ట‌ర్ చేసే ఈ ఆకు గురించి మీకు తెలుసా.. వజ్రంతో సమానమంటూ?

Ajwain Leaves: వంటగదిలో లభించే వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అలాగే వాము ఆకులు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి. అందుకే వాము ఆకులని కనీసం మూడు నెలలకి ఒకసారి ద్రవ రూపంగా అయినా మరి ఏ విధంగా అయినా తీసుకుంటే కడుపు శుభ్రపడుతుంది. అలాగే వాము ఆకు తినటం వల్ల చిన్నపిల్లలకు వచ్చే కడుపునొప్పి ఉపసమిస్తుంది. తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే జలుబు, ఇన్ఫెక్షన్ వంటి వాటితో బాధపడుతుంటే వాళ్లకి వాము మరిగించిన నీరు తాగటం వలన సత్వర ఉపసమనం లభిస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలకు వాము ఆకు చక్కని పరిష్కారం. వాము ఆకుతో బజ్జీలు వేసుకున్నా, వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకొని గాని తినడం వలన ఆ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే వాము ఆకు అజీర్తి సమస్యని దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే నోటి దుర్వాసనతో బాధపడేవారు వాము ఆకుని నమిలి తినడం వలన ఆ సమస్యని సత్వరమే తగ్గించుకోవచ్చు.

అలాగే శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చటంలో వాము వాకు సహాయపడుతుంది. వాము ఆకు ని తీసుకోవడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. అలాగే ఆస్తమా లక్షణాలను కూడా తగ్గించడంలో వాము బాగా ఉపయోగపడుతుంది. ఈ వాము ఆకు మధుమేహ సమస్యని కూడా అదుపులో ఉంచుతుంది. వేపాకుల పొడిని, వాము గింజలను గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

అలాగే ఈ ఆకులు మైగ్రేన్ నుంచి తక్షణ ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది. అలాగే తలకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా తొలగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో వాము ఆకులు సహాయపడతాయి. వాము నూనె సైతం ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. వాము ఆకుని గింజలని ఉడకబెట్టి ఆ నీటిని తాగడం వలన విరోచనాలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఆకుని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -