Home Guard: హోం గార్డు క‌న్నుమూత‌.. పాపం కేసీఆర్ సర్కార్ దే.. ఇంతకు మించి ప్రూవ్ చేయాలా?

Home Guard: రెండు నెలలుగా వేతనాలు అందకపోవటంతో హోమ్ గార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న రవీందర్ కన్నుమూశారు. కంచన్బాగ్ డి ఆర్ డి ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. ఈఎంఐ చెల్లింపు తేదీ వచ్చినా జీతం అందకపోవటంతో హోంగార్డు రవీందర్ ఒత్తిడికి గురయ్యారు. రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. వేతనం చెల్లింపులో జాప్యానికి నిరసనగా ఆఫీసులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సెప్టెంబర్ 5వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన రవీందర్ అంతకుముందు వేతనాలు గురించి హోంగార్డుల కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారని అడిగిన రవీందర్ కు చెక్కులు క్లియర్ అవ్వాలని ఉద్యోగి బదులిచ్చాడు. రెండు నెలలుగా జీతాలు లేవని చెప్పడంతో వెళ్లి సీఎం ని అడుగు అంటూ పోలీస్ అధికారి సూచించారు. దీంతో మనస్థాపానికి గురైన రవీందర్ ఇంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.

ఈయన శుక్రవారం పొద్దున్న ప్రాణాలతో పోరాడుతూ ఆఖరి శ్వాసిని విడిచారు. ఈ మృతితో రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల్లో ఆవేదన కట్టలు తెగుతుంది. వారంతా హైదరాబాద్ కు చేరుకొని రవీందర్ భౌతికకాయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే కేసీఆర్ సర్కారు నిర్బంధం విధించింది. ఆదే సమయంలో హైదరాబాదుకు ఈత ప్రాంతాల నుంచి హోంగార్డులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను సర్కిల్ ఇన్స్పెక్టర్లకు అప్పగించింది.

ఎవరైనా ప్రభుత్వం గీసిన గీతను దాటి వస్తే వారిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. చనిపోయిన రవీందర్ చావుకి బాధ్యత ఎవరిది అంటూ ఆయన సతీమణి సంధ్య గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే తన భర్తని ఏఎస్ఐ కానిస్టేబుల్ వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తన భర్త మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -