AP: ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే మాత్రం అలా చేయక తప్పదా?

AP: ఏపీలో 2014 ఎన్నికలు విభజన గాయాల చుట్టూ జరిగాయి. 2019 ఎన్నికలు విభజన హామీ అయిన ప్రత్యేకహోదా అంశం చుట్టూ జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకహోదా అంశాన్ని అన్ని పార్టీలు కూడా మర్చియాయి. దీంతో, ఇక ఏపీలో ప్రత్యేకహోదా పేరే వినిపించదు అనుకున్నాం. కానీ, షర్మిల పుణ్యమా అని ఈ ఎన్నికల్లో కూడా ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యేకహోదాయే ప్రధాన అస్త్రంగా షర్మిల ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. దీంతో సీఎం జగన్ ఈ అంశంపై నోరువిప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లి రావడం.. ప్రత్యేకహోదా గురించి కేంద్రపెద్దలను అడిగానని చెప్పడం తప్పా.. నిజంగా జగన్ ఈ ఐదేళ్ల పాటు మాట్లాడారో లేదో తెలియదు.

 

ఆయన సీఎం అయిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ప్రత్యేకహోదా ఆశలపై నీళ్లు చల్లారు. బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజారిటీ ఉంది కనుక.. ప్రత్యేకహోదా కావాలని అడగటం తప్పా.. చేసేదేమీ లేదని తేల్చేశారు. ఆ తర్వాత ఆయన నోటి నుంచి ప్రత్యేకహోదా మాటే వినిపించలేదు. కానీ, షర్మిల ప్రచార ఒత్తిడితో జగన్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉందికనుక మనం చేసేదేమీ లేదని పాత పాటే పాడారు. అంతేకాదు.. రాష్ట్ర విభజన రోజు ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో పెట్టి ఉంటే.. కోర్టుకు వెళ్లి అయినా హోదా సాధించుకునే వాళ్లమని అన్నారు.

సీఎం జగన్ హోదానుంచి తప్పించునే ప్రయత్నం బాగానే చేస్తున్నారు కానీ, ఆయన చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీ ఉంది కనుక హోదా విషయంలో ఏం చేయలేమన్న జగన్.. గతసారి టీడీపీని ఎందుకు నిందించారో చెప్పాలి? 2014లో కూడా బీజేపీ మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీ వచ్చింది. మరి టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే హోదా సాధ్యమవుతోందని ఎందుకు బద్నాం చేశారో చెప్పాలి?

 

ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో పెడితే కోర్టుకు వెళ్లి అయిన హోదా సాధించేవాళ్లమని అప్పటి కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేశారు. కానీ, చట్టంలో ఉన్న ఎన్ని అంశాలపై కోర్టుల్లో పోరాటం చేస్తున్నారో.. జగన్ సమాధానం చెప్పాలి. వెనకబడిన జిల్లాలకు ఏడాది 50 కోట్లు ఇవ్వాలని చట్టంలో ఉంది సాధించారా? కడప స్టీల్ ప్లాంట్ సాధించారా? దుగ్గిరాజపట్నం పోర్టు సాధించారా? విశాఖకు రైల్వే జోన్ చట్టంలో ఉంది సాధించారా? వీటన్నింటికి జగన్ సమాధానం చెప్పాలి. చట్టంలో లేని ప్రత్యేకహోదాకు ఓ సమాధానం జగన్ కి బాగా దొరికింది కానీ..ఆ సమాధానం నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వీటి ఏమని జగన్ సమాధానం చెబుతారు? ఇప్పుడు కూడా షర్మిల ప్రత్యేకహోదాపై ప్రశ్నిస్తున్నారు కనుక.. అది రాజకీయంగా నష్టం చేస్తుందేమోనని జగన్ మాట్లాడుతున్నారే తప్పా.. నిజానికి జగన్‌కు హోదాపై ఎలాంటి చిత్తశుద్ది లేదు. ఐదేళ్లుగా ఈ విషయం తెలుస్తూనే ఉంది. అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఇది రుజువైంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -