Rajdhani Files: రాజధాని ఫైల్స్ విడుదలైతే మాత్రం భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా?

Rajdhani Files: తెలుగు వన్ ప్రొడక్షన్ లో రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం ట్రైలర్ సోమవారం సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రస్తుతం కోటి వ్యూస్ కి చేరుకుంది ఒక రైతుకి, భూమికి, ప్రభుత్వానికి మధ్య జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కటంతో ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది. ఈ సినిమాని ఈనెల 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మూవీ మేకర్స్.

 

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారిపోయింది. అరుణ ప్రదేశ్ లో కె ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధాని ఎలా విధ్వంసం చేసిందో, అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఎలాంటి కర్కస వైఖరిని ప్రదర్శించిందో రాజధాని ఫైల్స్ ట్రైలర్ లో చూపించారు. నాలుగు ప్రాంతాలు నాలుగు రాజధానులే తమ ఎజెండా అంటూ అమరావతి విధ్వంసానికి పూనుకోవటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

యాత్ర 2 సినిమాకి ఎంత ప్రమోషన్ చేసిన రాని స్పందన ఏమి చేయకుండానే రాజధాని ఫైల్స్ కి వచ్చేసింది. అదీ తక్కువ సమయంలోనే ఐదు మిలియన్ వ్యూస్ ని సంపాదించుకుంది. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది యాత్ర టు సినిమా ప్రమోషన్ రిజల్ట్స్. యాత్ర సినిమాకి ఉన్నంత బజ్ యాత్ర 2 కి కనిపించడం లేదు. రేపు యాత్ర 2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది. బుక్ మై షో లో టికెట్లు అవైలబుల్ లోనే వున్నాయి.

 

కానీ జనాల నుంచి స్పందన మాత్రం లేదు. సాధారణ ప్రజలు ఈ సినిమాని అసలు సినిమా గానే భావించడం లేదు. అలా అని థియేటర్స్ దగ్గర జనం లేకపోతే బాగోదు కాబట్టి టిక్కెట్లు పంచిపెట్టే బాధ్యతని వాలంటీర్లు తీసుకున్నారు. టికెట్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ ఫేస్బుక్ లలోని, ట్విట్టర్లలోని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రాజధాని ఫైల్స్ దెబ్బకి యాత్ర 2 మూవీ కుదేలైపోయిందని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -