Rajdhani files: ఒకే ఒక్కడి అహం..వేల మంది రైతుల కన్నీరు.. రాజధాని ఫైల్స్ కాన్సెప్ట్ ఇదే!

Rajdhani files: ఒకే ఒక్కడి అహం వేల మంది రైతులకు కన్నీరు, కోట్ల మంది కుటుంబాల భవిష్యత్తు అంటూ రాజధాని ఫైల్స్ పోస్టర్ విడుదలైంది. భాను ప్రకాష్ దర్శకత్వంలో కంఠమనేని రవి శంకర్ నిర్మాతగా ఈ మూవీ రూపకల్పన జరిగింది. అయితే ఇందులో నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎటువంటి ప్రమోషన్స్, హడావిడి లేకుండా మూవీ మేకర్స్ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.

 

వైకాపా నాయకులలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే తమ రాష్ట్రానికి రాజధాని లేదని ఈ దేశంలో తమ అస్తిత్వంకి సరైన గుర్తింపు లేకుండా పోతుందని పక్క రాష్ట్రాల వారి ముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మిగిలిపోయాం అనే బాధ, ఎమోషన్ నిరుత్సాహంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఫైల్స్ తో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చూపించనున్నారు. నిజానికి ప్రజలని అత్యంత ప్రభావితం చేసే మాధ్యమాలు ఒకటి రాజకీయం రెండు సినిమాలు.

అయితే సినీ రంగాన్ని రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పవచ్చు. కానీ సినిమాలు రాజకీయాలను ఏమాత్రం ప్రభావితం చేస్తాయో అనేది చెప్పలేము. కానీ ప్రతి పార్టీలను కట్టడం చేయటానికి తమ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి సినిమాని ఉపయోగించుకుంటారు చాలామంది. వైసీపీ ఇదే సూత్రాన్ని పాటించి గత ఎన్నికల సమయంలో యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో తన పార్టీకి మైలేజీ పెంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి అంతే డామేజ్ తీసుకు రాగలిగారు.

 

అయితే ఈసారి కూడా అదే ఫార్ములాని నమ్ముకున్న జగన్ యాత్ర టుని సిద్ధం చేసుకున్నారు. అయితే వారి వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడంతో అది కోర్టులో విడుదలకు ఎదురుచూస్తున్న ఖైదీల మాదిరి బయటికి రావడానికి కష్టపడుతుంది. రాజధాని ఫైల్స్ ప్రజల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రజలు నెత్తిన పెట్టుకుంటే మాత్రం ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా నెత్తి పెట్టుకున్న జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపించడమే అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -