Hair: రాత్రి సమయంలో శిరోజాలను దువ్వితే ఇంటికి దరిద్రం పడుతుందా.. ఏం జరిగిందంటే?

Hair: చాలామంది ఈ జనరేషన్ పిల్లలు పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడంతో పాటు మూఢనమ్మకాలు అంటూ వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే పూర్వం రోజుల్లో పెద్దలు పాటించే విషయాలలో ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ కూడా దాగి ఉందన్న విషయం మనందరికి తెలిసిందే. అందుకే పెద్దవాళ్ళ చెప్పిన మాటల‌ను కచ్చితంగా అనుసరించాలి. ఎందుకంటే దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో పెద్దలు కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు. సూర్య స్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవకూడదని, గోళ్లు కత్తిరించుకోకూడదని, తలను దువ్వుకోకూడదని చెబుతూ ఉంటారు.

అయితే, ఎందుకు మనం సూర్యాస్తమయం సమయంలో, కురులని విరబోసుకోకూడదు? ఎందుకు దువ్వుకోకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్యాస్తమయం సమయంలో తల దువ్వుకోకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. సూర్యాస్తమయం అయిన తర్వాత తలని అసలు విప్పకూడదట. సూర్యాస్తమయం తర్వాత కురులని ముట్టుకోకూడదు అని కూడా అంటూ ఉంటారు. చెడు శక్తులు బయట సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోకూడదు. చెడు శక్తులకి శక్తి ఎక్కువ ఉంటుంది. అందమైన పొడవాటి కురులని కలిగిన మహిళల్ని అవి లక్ష్యంగా పెట్టుకుని వస్తాయట. అందుకని అస్సలు తల దువ్వుకోకూడదు.

 

గట్టిగా జడ వేసుకుని మహిళలు ఉండాలి. కానీ ఈ జనరేషన్ పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు జుట్టును అలా విరబోసుకునే ఉంటారు. పూజ చేసే సమయంలో మహిళలు కురులు విప్పుకొని ఉండకూడదు. మహిళలు జుట్టు విప్పుకుంటే చెడు శకునం అంటారు. అలానే ఒక్కొక్కసారి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఎందుకంటే చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తుల చేతిలో ఆ జుట్టు పడితే దుష్టశక్తులకి బలవుతారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జుట్టుని పారేయకూడదు. పౌర్ణమి రోజు రాత్రిళ్ళు కురులను దువ్వుకోకూడదు. పౌర్ణమి నాడు రాత్రిళ్ళు కిటికీ పక్కగా నిలుచుని కురులని దువ్వుకుంటే చెడు శక్తులు ఆవహిస్తాయి. నెలసరి సమయంలో మొదటి రోజు చాలా మంది తలస్నానం చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలా చేస్తే పిచ్చెక్కుతుందట. కానీ అలా స్నానం చేయడం వలన అధిక రక్తాన్ని కోల్పోతుంటారు. దానితో నీరసం అయిపోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ జుట్టు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ల మధ్య గొడవలు కలుగుతాయట.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -