World Record: ప్రపంచ రికార్డు స్థానం సంపాదించుకోవడం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడంటే?

World Record: మామూలుగా కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం ఏంటో అర్థం కాదు. వారి ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఏదైనా గుర్తింపు సాధించాలి అంటే దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటారు. అయితే ఒక వ్యక్తి కూడా రికార్డ్ సాధించడం కోసం ఏకంగా జుట్టును పెంచుకున్నాడు. అయితే ఆ జుట్టును పెంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే..

మామూలుగా కొందరు స్వామీజీలు గ్రామాల్లోకి వెళ్లి కొన్ని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అయితే 23 ఏళ్ల కిందట రాజస్థాన్లోని రతన్ గడ్ జిల్లాలో రామ్ సుఖ్ దాస్ మహారాజ్ అనే వ్యక్తి వచ్చి కొన్ని ఉపన్యాసాలు అందించాడు. అనేక విషయాలు గురించి తెలిపాడు. అయితే ఆ కార్యక్రమానికి ఎంతోమంది స్థానికులు హాజరవ్వగా అందులో హుద్దెరా గ్రామానికి చెందిన గోపాల్ రామ్ ప్రజాపత్ అనే వ్యక్తి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇక ఇతడు టైలరింగ్ పనిచేస్తుంటాడు. అయితే ఆ వ్యక్తి ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ స్వామీజీ వెంట్రుకలు పెంచుకోవడం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. వెంట్రుకలు పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయని.. ఆ వెంట్రుకలను ప్రతిరోజు అల్లుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అనటంతో వెంటనే గోపాల్ అప్పటినుంచి జుట్టు పెంచుకుంటూనే ఉన్నాడు.

ఇక ఇప్పుడైనా జుట్టు 5 అడుగుల 2 అంగుళాల పొడవు పెరిగింది. ఇక ఈయన జుట్టు చూడటానికి అక్కడున్న గ్రామస్తులు తరలి వస్తుంటారని తెలిసింది. ఇక ఈ జుట్టు పెరగడానికి అతడు నెలకు 500 రూపాయలు ఖర్చవుతుందని అన్నాడు. అంటే ఇప్పటివరకు లక్ష 40,000 ఖర్చు అయిందని అన్నాడు. ఇక తన జుట్టు కోసం వారంలో ఒకరోజు ముల్తాని మట్టి పెట్టడమే కాకుండా వేపనీలతో కడుగుతానని అన్నాడు. ఇక ప్రపంచ రికార్డు స్థానం సంపాదించుకోవడం తన టార్గెట్ అని కూడా అన్నాడు. ఇక బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని.. నిద్ర కూడా సరిగా పట్టదు అని అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -