Niharika: నిహారిక భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Niharika: మెగా డాటర్ నిహారికని వివాహం చేసుకోక ముందు వరకు చైతన్య జొన్నలగడ్డ గురించి ఎవ్వరికీ పరిచయం లేదు. కానీ ఒక్కసారిగా నిహారికను వివాహం చేసుకున్న తర్వాత చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. నిహారిక, చైతన్య వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వివాహం జరిగిన కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇందుకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకోవటమే కాకుండా వారి పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేయడంతో ఈ వార్తలు మరింత జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా మెగా కుటుంబానికి చెందిన వ్యక్తిగా నిహారిక గురించి అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ జొన్నలగడ్డ వెంకట చైతన్య గురించి చాలామందికి పెద్దగా తెలియదు. జొన్నలగడ్డ చైతన్య ఎవరు ఆయనకు సంబంధించిన కొన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటచైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకరరావు పోలీసు అధికారి. ఆయన గుంటూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. ఇక చైతన్య తాత గారు వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా ఇన్‌స్పెక్టర్‌. చైత‌న్య త‌ల్లి గృహిణి. అతనికి దీపిక అనే ఒక అక్క ఉంది. ఆమె తన భర్తతో కలిసి USA లో ఉంటుంది. హైదరాబాద్ కి చెందిన చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్‌ లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తరువాత, రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పొందాడు.

 

ఇక చదువు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలలో ఇంటర్న్ షిప్ చేసి.. వ్యాపార రంగంలో మంచి అనుభవం సంపాదించాడు. చైతన్య జొన్నలగడ్డ మొదటగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహా సంస్థ KPMGలో అసిస్టెంట్ మేనేజర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత GMR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఇంటర్న్‌గా కూడా పనిచేశాడు. అలాగే ప్రాసెస్‌వీవర్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా వర్క్ చేశాడు. అతను ప్రస్తుతం, టెక్ మహీంద్రా గ్రూప్‌లో జాబ్ చేస్తున్నాడు. అక్కడ ప్రొడక్ట్ ఓనర్ కమ్ మేనేజర్‌గా మంచి స్కిల్స్ చూపించి బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా ప్రమోషన్ పొందాడు. నెస్లే, IBM, Airtel తో పాటు అనేక ఇతర ప్రముఖ భారతీయ కంపెనీలలో అతడు పెట్టుబడి పెట్టాడు. ఇక చైతన్యకు 3 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -