LIC: ఈ ఎల్ఐసీ పాలసీ బెనిఫిట్స్ గురించి తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

LIC: ఎల్ఐసి కంపెనీ ఇప్పటికీ ఎన్నో రకాల పాలసీలను అందించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో బీమా రత్న పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాగా ఈ భీమా రత్న పాలసీ అనేది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండిజీజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్‌లో మరో బెనిఫిట్ కూడా ఉంది. ఫార్ట్ టర్మ్ పేమెంట్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బోనస్ ని కూడా పొందవచ్చు. రూ. 5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది వయసు నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారి పేరు పై ఈ ప్లాన్ ని పొందచ్చు.

కాగా ఈ పాలసీ ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించవచ్చు. ఈ ప్లాన్ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. అయితే ఇందులో మీరు ఎంచుకున్న టర్మ్ కంటె తక్కువ కాలం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు 15 ఏళ్ల టర్న్ ఎంచుకుంటే మీరు 11 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అదే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు 16 ఏళ్లు ప్రీమియం కడితే సరిపోతుంది. 25 ఏళ్ల టర్మ్ ఎంచుకున్న వారు 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాలసీ తీసుకున్న వారికి మధ్యలో 25 శాతం చొప్పున డబ్బులు చెల్లిస్తూ వస్తారు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే వారికి 13వ సంవత్సరం, 14వ సంవత్సరం ఈ డబ్బు లభిస్తుంది.

 

అదే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 18వ సంవత్సరం, 19వ సంవత్సరంలో డబ్బులు పొందవచ్చు. అలాగే 25 ఏళ్ల టెన్యూర్ అయితే 23వ సంవత్సరం, 24వ సంవత్సరం డబ్బులు వస్తాయి. ఒకవేళ మీకు 30 ఏళ్లు ఉన్నాయని అనుకుంటే మీరు 25 ఏళ్ల టర్మ్‌తో రూ. 20 లక్షల బీమా మొత్తానికి ఈ ప్లాన్ తీసుకుంటే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 48.5 లక్షల వరకు వస్తాయి. నెలవారీ ప్రీమియం రూ. 9,600 వరకు పడుతుంది. అంటే మీరు రోజుకు రూ. 320 పొదుపు చేస్తే సరిపోతుందన్నమాట. 21 ఏళ్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీరు ప్రీమియం రూపంలో చెల్లించే మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది. అంటే మీకు రెట్టింపు బెనిఫిట్ ఉంటుంది. కాగా మీకు రెండు సార్లు రూ.5 లక్షల చొప్పున లభిస్తాయి. 23వ సంవత్సరం, 24వ సంవత్సరం ఈ డబ్బులు వస్తాయి. అదే ఒకవేళ పాలసీ దారుడు తన 43వ ఏటా మరణిస్తే అప్పుడు చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 15 లక్షలు అవుతుంది. డెత్ క్లెయిమ్ రూ. 40 లక్షలు వస్తుంది. సహజ మరణం అయితే ఈ బీమా మొత్తం పొందవచ్చు. అదే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 50 లక్షలు బీమా మొత్తం చెల్లిస్తారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -