Hospital: ఈ ఆస్పత్రి ప్రత్యేకతల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hospital: ప్రస్తుత రోజుల్లో చాలామంది డబ్బు లేని వారు ఆరోగ్యం బాగో లేకపోయినా కూడా చూపించుకోలేని పరిస్థితి అని చెప్పవచ్చు. అందుకు గల కారణం హాస్పిటల్స్ లో వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేయడం. చిన్నచిన్న క్లినిక్స్ నుంచి పెద్దపెద్ద హాస్పిటల్స్ వరకు వైద్యం పేరుతో వేలకు వేలు డబ్బులు లాగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఒక రకమైన హాస్పిటల్స్ కి వెళ్ళాలి అన్నా కూడా భయపడాల్సిన పరిస్థితిలో నెలకొంటున్నాయి. దీంతో చాలా మంది చేసేది ఏమీ లేక ప్రాణాలపై కూడా ఆశలు వదులుకుంటున్నారు. కొంతమంది ప్రాణాలపై ఉన్న తీపితో లక్షలు నేను అప్పు చేసి మరి హాస్పిటల్స్ లో చూపించుకుంటున్నారు.

ఇటీవల కాలంలో తక్కువ ఖర్చుతో మంచి మంచి వైద్యం అందించే హాస్పిటల్స్ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే తక్కువ ఖర్చు అనగానే డబ్బు ఉన్న వారు సైతం అక్కడికి చూపించుకోవడానికి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో వైద్యం అనగానే వందల సంఖ్యలో హెల్త్ చెక్ చేయించుకోవడానికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రదేశాలలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేస్తుండగా మరికొన్ని చోట్ల తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ మంచి మంచి వైద్యం అందిస్తున్నారు. అలాంటి హాస్పిటల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఆ హాస్పిటల్లో ఓపి విలువ పది రూపాయలు. అంటే కేవలం పది రూపాయలకే వైద్యం చేస్తారని అర్థం. అదేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే. మరి ఆ పది రూపాయల హాస్పిటల్ ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే నేషనల్ హైవే లో వెళ్తున్నప్పుడు ఏపీ సిక్స్త్ బెటర్ లైన్ అనే ఒక పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది. అలా నేరుగా హైవే దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అలా వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉండగా మనకు పోలీస్ క్వార్టర్స్ వెనకాలే పది రూపాయల హాస్పిటల్ మనకు కనిపిస్తుంది. ఆ హాస్పిటల్ పేరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. హాస్పిటల్ కూడా చాలా పెద్దగా ఉండడంతో పాటు సొంతంగా ఒక గవర్నమెంట్ బస్ పేషెంట్స్ ని ఎక్కించుకొని వెళ్లడానికి అదేపనిగా ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రాబ్లం మీద వచ్చిన కానీ కేవలం పది రూపాయలకు ఓపి. చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఇచ్చింది చెక్ చేయించుకోండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -