Success: ఈ యువతి సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం కచ్చితంగా దండం పెట్టాల్సిందే!

Success: లక్ష్యం చేరుకోవాలన్న పట్టుదల ఉంటే ఎవరైనా సరే ఆ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటారు. కొంతమంది పేద ప్రజలకు పెద్ద పెద్ద చదువులను చదవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ అందులో కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే తాజాగా ఒక పేద యువతి కూడా తన లక్ష్యాన్ని చేరుకొని అందరితో శభాష్ అనిపించుకుంది. ఒకప్పుడు బొగ్గులమ్మే ఆ యువతి.. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అయ్యింది.

ఆ యువతీ పేరు గోపిక గోవింద్.ఆమె గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి. తనకు చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కల ఉండటంతో మొత్తానికి ఆ కల తీర్చుకుంది. తను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకు ఎయిర్ హోస్టెస్ కావాలన్న కోరిక పుట్టింది. కానీ తమ కుటుంబ సభ్యులు పేదవాళ్లు.

అటవీ భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేసి పొట్ట నింపుకుంటారు. నిజానికి పేద పిల్లలు తమ స్థాయిని చూసుకొని అతిగా చదువుకోవాలన్న కోరిక పెంచుకోరు. కానీ గోపిక మాత్రం తాము ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది. అలా బిఎస్సి వరకు చదివి ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్ అందుకుంది.

అంతేకాకుండా పట్టుదలతో హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకుంది. అలా తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొనగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయింది. ఇక ఈమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడిన తీరు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -