Success: సక్సెస్ రావాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Success: జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క విషయంలో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అందుకోసం కష్టపడుతూ ఉంటారు. అయితే కేవలం కొంతమందికి మాత్రమే కష్టపడిన దానికి ఫలితం దక్కుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కూడా సక్సెస్ రాకపోవడంతో కొందరు దిగులు చెందుతూ ఉంటారు. అయితే కష్టపడినా సక్సెస్ రావడంలేదని బాధపడుతున్నారా? వెంటనే ఈ పరిహారాలు పాటించాల్సిందే.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోచార గ్రహస్థితి బాగాలేనప్పుడు అనేక సమస్యలతో సతమతమౌతుంటారు.

అటువంటివారు ప్రతిరోజూ రావిచెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అలాగే వారంలో మీకు వీలైనన్నిసార్లు గోవుకు మీకు తోచిన గడ్డి పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైనా ఇంటి నుంచి శుభకార్యాలకు వెళుతున్న సమయంలో గణేశాయ అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత మీరు వెళ్తున్న దిశకు వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కు వేసి ఆపై గణపతి దగ్గర ప్రశాంతంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకొని బయటకు వెళ్లాలి.

 

ఇలా చేయడం వల్ల మీరు వెళ్లే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే ఆదివారం రోజు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో ఆర్గ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆదివారం రోజున మాంసాహారం ముట్టుకోకూడదు. మద్యం సేవించకూడదు. అలాగే ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఒక నలుపు రంగు దారాన్ని కొనుగోలు చేసి మీ వయసుకు సమానమైన ముడులను కట్టి అనంతరం అరటి లేదా తులసి ఆకుల రసాన్ని ప్రతి ముడి పై వేసి తర్వాత పసుపు, సింధూరాన్ని దారానికి రాయండి. అనంతరం ఆ దారాన్ని కుడి చేతికి కిందగా ఉండేట్లు ధరించండి. ఈ విధంగా ఆ దారాన్ని 21 రోజుల పాటు ధరించాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నిరాశ తొలుగి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అర్జెంటు పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి నువ్వుల నూనె వేసి తయారు చేసిన ఆ రొట్టెను మీతో పాటు తీసుకెళ్లి మార్గమధ్యలో కాకులు కనిపిస్తే వాటికి ఆహారంగా వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -