Richest MLA: జగన్, చంద్రబాబు ఆస్తుల విలువెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Richest MLA: ఏ డి ఆర్ ( అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ) మరొకసారి దేశవ్యాప్తంగా సంపన్న ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది దేశంలో టాప్ టెన్ రిచ్ ఎమ్మెల్యేల లిస్టుని అలాగే పేద ఎమ్మెల్యేల లిస్ట్ ని కూడా తయారు చేసి విడుదల చేసింది. సాధారణంగా ఎమ్మెల్యేల ఆస్తిపాస్తులు తెలుసుకోవాలని సాధారణ ప్రజలకి ఆసక్తి ఉండడం సహజమే.

అందుకే సదరు ఏ డి ఆర్ సంస్థ అధ్యయనం చేసి ఆ వివరాలని మన ముందు ఉంచింది దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలకి 1400 కోట్ల ఆస్తులు ఉంటే అత్యంత పేద ఎమ్మెల్యేకి 2000 విలువైన స్థిరచరాస్తులు ఉన్నాయి. దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన నిర్మల్ కుమార్ ధారా అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు.

 

కర్ణాటక కు చెందిన మరొక ఎమ్మెల్యే కే హెచ్ పుట్ట స్వామి గౌడ 1267 కోట్లతో రెండో స్థానంలోనూ, మూడో స్థానంలో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు చెందిన అత్యంత పెద్ద వయసు కూడా అయినా ఎమ్మెల్యే ప్రియా కృష్ణ 1156 కోట్లతోనూ నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 668 కోట్ల తో నాలుగవ స్థానంలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే జేఎల్ పటేల్ 661 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.

 

అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం 510 కోట్ల రూపాయలతో ఏడవ స్థానంలో నిలవడం గమనార్హం. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎస్ సురేష్ 648 కోట్లతో ఆరవ స్థానంలోనూ, బీజేపీ కి చెందిన పరాగ్ సింగ్ 500 కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఎస్ బాబా 500 కోట్ల కోట్లతో తొమ్మిదవ స్థానం, బీజేపీ కి చెందిన మంగళ ప్రభాత్ 440 కోట్లతో పదవ స్థానంలోనూ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -