Slippers: చెప్పులు ఆ దిక్కులో వదిలిపెడితే.. దరిద్రం మీ వెంటే?

Slippers: వాస్తు శాస్త్రం అన్నది కేవలం ఇంటి నిర్మాణం విషయంలో మాత్రమే కాకుండా ఇంట్లోనే వస్తువుల అమరిక విషయంలో కూడా వర్తిస్తుంది. ఇంట్లో ఏ వస్తువులు ఏ స్థానంలో ఉండాలి అన్న విషయాన్ని కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి వాటిలో చెప్పుల అమరిక కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుంది. మరి చెప్పులు ఏ దిక్కులో ఉండాలి లేదంటే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చెప్పులు ఎప్పుడూ కూడా చిందర వందరగా ఉంచకూడదు.

ఇలా చెప్పులు చిందరవందరగా పారేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. తూర్పు, ఉత్తర దిక్కులను శాస్త్రం పవిత్రంగా భావిస్తుంది. ఈ దిక్కులు దేవుడి నెలవులని నమ్మకం. కాబట్టి అటువైపు చెప్పులు వదల కూడదు. ఈ దిక్కున చెప్పులు పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలే అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. అది మంచి అలవాటు కాదు. చెప్పుల కోసం ఒక షూర్యాక్ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో షూ రాక్ పెట్టుకోవడానికి సరైన దిక్కు నైరుతి అని వాస్తు చెబుతోంది.

 

కాబట్టి అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. చిన్న ఇళ్లలో నివసించే కొందరు షూరాక్ పెట్టుకునేందుకు స్థలం లేకపోవడం వల్ల బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు..ఆ కుటుంబానికి హానికరం. ఇలా చెయ్యడం వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు తలెత్తుతాయి. దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో శాంతి కరువవుతుంది. కనుక చెప్పుల రాక్ ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు.
ఇంటి ముఖద్వారం చాలా పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక తప్పనిసరిగా ముఖద్వారం పరిసరాలు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా బావించి పూజిస్తారు కూడా. అందుకే ముఖద్వారం వద్ద చెప్పులు, షూ ర్యాక్ పెట్టుకోవడం మంచిదికాదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అలిగి వెనక్కి వెళ్లిపోతుంది. కాబట్టి ముఖద్వారం ముందు చెప్పులు వదల కూడదు. డబ్బు, నగలు దాచుకునే అల్మారా లేదా బీరువా లేదా కంబోర్డ్ ను చాలా పూజనీయంగా చూసుకోవాలి. ఈ బీరువాలు, అల్మారాల కింద చెప్పులు వదల కూడదు. అసలు ఆ గదిలోకే చెప్పులతో రాకుండా ఉండడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -