Population: తొలి స్థానంలో భారత్.. దేశ జనాభా ఎంతో మీకు తెలుసా?

Population: భారతదేశ జనాభా ఎంత అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఎంత మహా అంటే 120 నుంచి 125 కోట్లు అని చెబుతుంటారు. కానీ అది ఒకప్పటి మాట. ఎందుకంటే భారతదేశంలో రోజురోజుకీ జనాభా సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కారణాల సంఖ్యతో పోల్చుకుంటే జననాల సంఖ్యని విపరీతంగా పెరుగుతోంది. దీంతో తాజాగా భారత్ రికార్డును సృష్టించింది. అదేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే మొన్నటి వరకు చైనా దేశం మొదటి స్థానంలో ఉండగా చైనాలో వెనక్కి నెట్టేసి 29 లక్షల అధిక జనాభాతో ఈ రికార్డుని అధిగమించినట్లు తాజాగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

కాగా ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస తాజాగా విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది.

 

ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది. ఈ ప్రకారంగా 2050 నాటికి జనాభా సంఖ్య ఎంత ఉండవచ్చు అన్న విషయంపై ఒక అంచనా వేశారు. ఐరాస వెలువరించిన వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2022 ప్రకారం గతేడాది నవంబర్‌ 15న ప్రపంచ జనాభా 800కోట్లు దాటింది. 1990లో చైనా జనాభా 114.4కోట్లు ఉండగా భారత జనాభా కేవలం 86.1కోట్లు మాత్రమే. గతేడాది నాటికి మనదేశ జనాభా 141.2కోట్లకు చేరగాచైనా జనాభా 142.6కోట్ల వద్దే ఉంది. ఇలా 2050 నాటికి భారతదేశ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. అదే చైనా జనాభా మాత్రం 131.7కోట్లకు పడిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో ఆయుర్దాయం పురుషుల్లో 71ఏళ్లు కాగా మహిళలకు 74ఏళ్లుగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా 804.5కోట్లుగా అంచనా వేయగా అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్‌, చైనాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా భారత్‌లో కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. భారత్‌లో జనాభా వేగంగా పెరుగడం పై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్‌ఎఫ్‌పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్‌నార్‌ పేర్కొన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -