Pawan: ఆ విషయంలో పవన్ కు పోటీని ఇచ్చే స్టార్ హీరో మరొకరు ఉన్నారా?

Pawan: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఇప్పటివరకు కేవలం ట్విట్టర్ లో మాత్రమే తన పార్టీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

ఇక ట్విట్టర్ సీఈవో మారిన తర్వాత ఎన్నో కొత్త నిబంధనలను తీసుకువచ్చారు దీంతో చిరాకు వచ్చినటువంటి వారందరూ కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ రకాల వాటిలో తమ ఖాతాలను ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్టర్ ఖాతా మాత్రమే ఉంది అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టారు.

 

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయగానే లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. నిమిష నిమిషానికి ఈయనకు ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన 6 గంటల 20 నిమిషాల్లో మిలియన్ మార్క్ దాటిపోయింది. ఇంత వేగంగా ఏ టాలీవుడ్ హీరో ఇన్స్ టాలో ఈ మైలురాయిని అందుకోలేదు. ఇంతా చేసి పవన్ ఒక్కటంటే ఒక్క పోస్టు పెట్టలేదు.

 

ఇలా ఒక్క పోస్టు కూడా లేకుండా కేవలం ఆరు గంటలలోనే వన్ మిలియన్ మార్క్ దాటారు అంటే మరి కొద్ది రోజులలో అత్యధిక ఫాలోవర్స్ కలిగినటువంటి హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ సృష్టిస్తారు అనడంలో ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అయితే ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే షేర్ చేస్తారా లేకపోతే సినిమా విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటారా అన్న విషయం తెలియాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -