CM Jagan: ఢిల్లీలో సీఎం జగన్ కు సమస్యలివేనా.. అసలేం జరిగిందంటే?

CM Jagan: సీఎం జగన్ ఢిల్ల వెళ్లారు.. ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని కేంద్రపెద్దలను అడిగారు. ఐదేళ్లుగా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ఇదే తంతు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ ఉండదు. ఒక్క మాట తక్కువ ఉండదు. అయితే, జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు మాత్రం కాస్త విచిత్రంగా ఉంటాయి. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ జెట్ స్పీడ్ లో జరిగినపుడు వెళ్తారు.. ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి అడుగుతారు. ఆ తర్వాత వివేకాహత్యకేసు విచారణ స్లో అయిపోతుంది. వివేకాహత్యకేసుపై సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారు. ఆ వెంటనే జగన్ ఢిల్లీ వెళ్తారు. ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి అడుగుతారు. సునీత పిటిషన్ మరుగున పడిపోతుంది. తనపై అవినీతి ఆరోపణ కేసు గురించి మీడియాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ ఢిల్లీ వెళ్తారు. ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి ప్రధానిని అడుగుతారు. ఆ తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణల కేసులో ప్రచారం ఆగిపోతుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తారు. అదేంటో కానీ.. ప్రత్యేకహోదా, విభజన హామీల పేరుతో ఢిల్లీకి వెళ్లినా.. ఆ తర్వాత ఏపీలో కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ, హోదా కానీ, విభజన హామీల అమలు కానీ జరగవు.

 

ఐదేళ్లుగా జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ఏపీ హక్కుల కోసం వెళ్లాను అంటారు. సొంత మీడియాలో కూడా ఇలాంటి రాతలే ఉంటాయి. కానీ, వెళ్లి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుకు.. కనీసం కొన్ని నెలలకు అయినా కేంద్రం నుంచి ఏపీకి నిధులు కానీ, విభజన హామీల అమలు కానీ జరుగుతుందా? అంటే చెప్పుకోవడానికి ఏం ఉండదు. విచిత్రం ఏంటంటే.. రెండు రోజుల క్రితం కూడా జగన్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారు అంటే మళ్లీ ప్రత్యేకహోదా, విభజన హామీల గురించేనని ప్రచారం చేస్తున్నారు.

ఆయన వెళ్లడానికి 4 రోజులు ముందే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌కు ముందు ఎవరైనా వెళ్లి రాష్ట్రం కోసం నిధులు కేటాయించండి అని అడుగుతారు. కానీ, ఏపీ సీఎం మాత్రం బడ్జెట్ పెట్టేసిన తర్వాత వెళ్లి అడిగారు. అయినా.. దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కనున కేంద్రం చేసిది ఏం ఉండదు. నిజానికి కేంద్రానికి మరో నెలరోజుల్లో ఎలాంటి అధికారాలు ఉండవు. ఇప్పుడు కేంద్రం ప్రత్యేకహోద ప్రకటిస్తుందా? విభజన హామీల ఆగమేఘాల మీద అమలు చేస్తుందా? ఇవన్నీ ప్రజలకు తెలియదా? కానీ, జనం ఏం చెప్పినా నమ్మేస్తారని ప్రత్యేకహోదా కోసమే వెళ్లానని జగన్ చెబుతున్నారు. అంతకు మించి ఒక్కమాట ఎక్కువ ఉండదు. తక్కువ ఉందడు. అందుకే.. కనీసం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న వచ్చింది కదా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అంటే.. సాయిరెడ్డి చెబుతారంటూ వెళ్లిపోయారు.

 

అయ్యా… పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానమంత్రి అంతే కాదు తొలి తెలుగు భారతరత్న అవార్డు గ్రహీత. అలాంటి వ్యక్తికి భారతరత్న రావడాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, ఒక సీఎంగా ఉన్న జగన్ మాత్రం ఆ విషయం గురించి మాట్లాడానికి పార్లమెంట్ సాక్షిగా నిరాకరించారు. దీంతో.. నేషనల్ మీడియా నవ్వుకుంటోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -