Telugu Kannada: తెలుగు, కన్నడ భాషలు ఒకేలా ఉండటం వెనుక అసలు కథ ఇదేనా?

Telugu Kannada: దక్షిణాదిలో అత్యంత సారుప్యత కలిగిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే టక్కున గర్తుకు వచ్చేవి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.

అక్కడి ఆచార వ్యవహారాలు, ఇక్కడి సాంప్రదాయాలు దాదాపు ఒకేలా ఉంటాయి. మహిళల చీరకట్టు నుంచి బొట్టపెట్టే విధానం వరకే కాదు… లిపి కూడా అలానే ఉంటుంది. అయితే ఇలా ఎందుకుంటుందనే దానిపైనే చాలా మందికి ఓ క్లారిటీ ఉండదు.

ప్రపంచంలో ప్రతి భాషకు ఒక చరిత్ర ఉంది. వాటి మూలాలు, నిర్మాణం ఆధారంగా భాషలను కుటుంబాలుగా విడతీశారు. ఇలా చూస్తే భారత్‌లో ప్రధానంగా 5 భాషా కుటుంబాలు కనిపిస్తాయి. ఇండో-యూరోపియన్ అంటే సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, గ్రీక్, లాటిన్ బాషలు. ద్రవిడియన్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ భాషలు. ఇలానే మిగిలిన వాటిని కూడా విడదీశారు.

 

భారత్‌లో ప్రధానమైన భాషా కుటుంబాల్లో ద్రవిడ లేదా ద్రావిడ ఒకటి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషలు ఈ కుటుంబంలో ఉన్నాయి. ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి పరిశీలన ప్రకారం.. దాదాపుగా 26కు పైగా ద్రావిడ భాషలున్నాయి.

 

మూల దక్షిణ ద్రావిడ భాషల సమూహం నుంచే దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు వచ్చాయని ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే పుస్తకంలో భద్రిరాజు కృష్ణమూర్తి రాశారు. అంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే మూలం నుంచి వచ్చాయి. అందువల్ల ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణం వంటి వాటిలో సారూప్యతలు కనిపిస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -