NDA Alliance Vs YSRCP Manifesto: కూటమి మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే వెయ్యి రెట్లు మేలు.. ప్రజల అభిప్రాయమిదే!

NDA Alliance Vs YSRCP Manifesto: ఆంధ్రప్రదేశ్లో మరొక పది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల హడావిడి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీలకు కూడా మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కూటమి సూపర్ సిక్స్ అంటూ ఆరు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వైసీపీ నవరత్నాలు ప్లస్ అంటూ గత ఎన్నికలకు ముందు విడుదల చేస్తున్నటువంటి మేనిఫెస్టో తిరిగి విడుదల చేశారు.

ఇలా ఈ రెండు పార్టీల ఎన్నికల మేనిఫెస్టో విడుదల కావడంతో ప్రజలందరూ కూడా ఏది ఉత్తమం అనే ఆలోచనలో పడ్డారు. అయితే కూటమి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 1500 డబ్బులు అందించనున్నారు. అలాగే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 చొప్పున అమ్మఒడి. రైతన్నలకు 20,000 రైతు భరోసా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ మహిళలు బస్సులు ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణం ఇలా అన్ని పథకాలను ప్రవేశపెట్టారు.

మరోవైపు జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి కేవలం ఒక్కరికే అది కూడా 15000 రూపాయలు మాత్రమే అందజేయబడుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకు మూడు లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ప్రకటించారు. కానీ కూటమి మేనిఫెస్టోలో పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ప్రకటించారు. విడతల వారీగా 3500 వరకు పెన్షన్ పెంపు. ఆసరా చేయూత వంటి పథకాలను కూడా వైసిపి కొనసాగిస్తూ వచ్చింది.

ఇలా ఈ రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు విడుదల కావడంతో వైసిపి మేనిఫెస్టో పోలిస్తే కూటమి మేనిఫెస్టో 1000 రేట్లు అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా కూటమికే మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో సర్వేలు కూడా కూటమిదే విజయమని తేల్చి చెప్పాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -