Jaipur Express: చేతన్ కాల్చడం వెనుక ఇంత జరిగిందా.. అతనికి ఆ సమస్య ఉందా?

Jaipur Express: జైపూర్ ఎక్స్ప్రెస్ లో నిన్న తెల్లవారుజామున ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రైలులో కాల్పులు జరిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కాల్పులలో భాగంగా ముగ్గురు ప్రయాణికులతో పాటు తోటి కానిస్టేబుల్ కూడా మరణించారు. ఇలా అందరూ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడి లేచారు. ఇలా ఈ ఘటనలో భాగంగా నలుగురు మరణించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

రాజస్థాన్లోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్నటువంటి రైలులో జరిగిన ఈ ఘటన గురించి నిందితుడు పట్ల ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కాల్పులు జరగడానికి గల కారణాలను తెలియజేశారు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన పై అధికారి ఏఎస్ఐ టీకా రామ్ మీనాను కాల్చి చంపేశారు.అనంతరం తరువాత భోగిలోని ముగ్గురు ప్రయాణికులపై కూడా ఈయన కాల్పులు జరగడంతో వారు కూడా సంఘటన స్థలంలోనే మరణించారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

 

ఈ విధంగా కాల్పులు జరిపిన చేతన్ సింగ్ తర్వాతి స్టేషన్ లో పారిపోవడానికి ప్రయత్నాలు చేయగా ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ మాట్లాడుతూ… చేతన్ సింగ్ కు షార్ట్ టెంపర్ ఉంది ఆయన వెంటనే కోపం తెచ్చుకొనే స్వభావం కలవారు.తన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ను చంపే సమయంలో పెద్ద గొడవ ఏమి చోటు చేసుకోలేదు. కానీ క్షణికావేశంలో ఆయనపై కాల్పులు జరిపారని తెలిపారు.అలాగే తనకు కనిపించిన వారిని కాల్చుకుంట పోయారంటూ అధికారులు వెల్లడించారు అయితే తాను ఒక మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానంటూ చేతన్ ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -