Punith: పునీత్ లేని లోటును అనుభవిస్తూ ఆయన భార్య చేసిన త్యాగం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Punith: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతాయో విడాకులు కూడా అంతే త్వరగా అవుతాయి. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవితం ఇందుకు పూర్తిగా విరుద్ధం. కన్నడలో ఆయన ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలిసిందే. అయినా ఆయన అశ్విని రేవంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని చివరి వరకు ఎంతో అన్యోన్యంగా జీవించారు ఆ జంట. అందుకే ఆ దేవుడికి కళ్ళు కుట్టి చిన్న వయసులోనే పునీత్ ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు.

పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరో గానే కాకుండా ఒక ఆదర్శ వ్యక్తిగా ఒక సమాజ సేవకుడిగా ఎన్నో కార్యక్రమాలను చేశాడు. ఆయన చనిపోయినప్పుడు కర్ణాటక మొత్తం అట్టుడికిపోయింది. అలాంటి వ్యక్తికి భార్య అయిన అశ్విని రేవంత్ కూడా పునీత్ రాజ్ కుమార్ పేరుని నిలబెడుతూ ఆయనకు తగ్గట్టుగానే ఆమె కూడా ప్రజా కార్యకలాపాలు చేస్తున్నారు. ప్రేక్షకులని ఓ కంట కనిపెడుతూ పునీత్ రాజ్ కుమార్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకి తీసుకు వెళ్తున్నారు.

 

వాళ్ల ఇద్దరి దాంపత్యం ఎంత అన్యోన్యమైనది అంటే పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత అశ్విని ఒక గ్రాము బంగారం కూడా ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒక గొప్పింటి కుటుంబానికి కోడలు, ఒక లెజెండరీ యాక్టర్ కి భార్య అయినప్పటికీ ఎక్కడ ధర్పం ప్రదర్శించకుండా సింపుల్ గా ఉంటూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది అశ్విని. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తరువాత దాదాపు చాలా కాలం పాటు ఆమె ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోయింది.

 

కూతురి పరిస్థితిని చూసి తట్టుకోలేక అశ్విని తండ్రి సైతం ఆమెని శోకసంద్రంలో ముంచి స్వర్గస్తుడైన విషయం ఆమె విషయంలో మరింత విచారకరం. అయినప్పటికీ ఆమె భర్త జ్ఞాపకాలతో, భర్త ఆశయాలని ముందుకు నడిపిస్తూ సగటు హిందూ స్త్రీగా ఒక విధవగా, ఒక సన్యాసినిగా బ్రతుకుతూ జీవితాన్ని, తన పిల్లలని, భర్త సేవా కార్యక్రమాలని ముందుకి నడిపిస్తుంది. నిజంగా ఆమె త్యాగానికి, ఆమె ఆత్మ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -