Tattoo: ఛాతీ మీద ఆ టాటూను రాఘవేంద్ర వేయించుకున్నారా.. ఏమైందంటే?

Tattoo: కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత నటుడు రాజ్ కుమార్ వారసుడిగా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.మాత్రమే కాకుండా ఎంతో మానవత్వం ఉన్న వ్యక్తిగం ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఎంతో మందికి అభిమాన హీరోగా మారిపోయారు.

ఇలా అతి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పునీత్ రాజ్ కుమార్ గత రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుకి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే. పునీత్ మరణించి రెండు సంవత్సరాలు అవుతున్న ఈయన మరణ వార్తను మాత్రం అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఫోటో ఏ కార్యక్రమంలో కనిపించిన ఆయన సోదరులు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.

 

పునీత్ కి ఇద్దరు సోదరులు ఒకరు శివరాజ్ కుమార్ కాగా మరొకరు రాఘవేంద్ర రాజ్ కుమార్.వీరిద్దరూ ఏ కార్యక్రమంలో పాల్గొన్న తన తమ్ముడిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్న సంఘటనలను మనం ఎన్నో చూసాము. అయితే తాజాగా పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు తన సోదరుడు అంటే అమితమైన ప్రేమ. అందరికన్నా చిన్నవాడు కావడంతో పునీత్ ను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూసుకునేవారు.

 

ఇలా కొడుకులా పెంచుకున్నటువంటి తన తమ్ముడు మరణ వార్త తనని ఎంతగానో కృంగతీసింది. ఈ క్రమంలోనే తన తమ్ముడి ప్రేమకు గుర్తుగా రాఘవేంద్ర రాజ్ కుమార్ తన చాతిపై తన తమ్ముడు పునీత్ ముద్దు పేరు అప్పు పేరును టాటూగా వేయించుకున్నారు. అదేవిధంగా పునీత్ ఇద్దరు కుమార్తెల పేర్లను కూడా ఈయన టాటూగా వేయించుకున్నారు. పునీత్ కుమార్తెల పేర్లు వందిత ధృతి కాక ముద్దుగా వీరిని టోటో, నుక్కి అని పిలుస్తారు దీంతో వేరే ముద్దు పేర్లు రాఘవేంద్ర రాజ్ కుమార్ ఛాతిపై వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో ఈయనకు పునీత్ అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -