Jagan-Chandrababu: ఒకేచోటకు బాబు, జగన్.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

Jagan-Chandrababu: ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య రాజకీయంగా వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు రాజకీయ విమర్శలు చిలికిచిలికి గాలివానలా మారి ఫ్యామిలీల మీదకు కూడా చేరుకుంటాయి. జగన్ ఫ్యామిలీపై చంద్రబాబు.. చంద్రబాబు ఫ్యామిలీపై జగన్ విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో తన భార్యను కించపరుస్తూ మాట్లాడారనే కారణంతో అధికారంలోకి వచ్చేంతవరకు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ చంద్రబాబు శపథం చేశారు. అసెంబ్లీకి వెళ్లడం మానేశారు. ఇక గతంలో వైఎస్ ఫ్యామిలీ గురించి చంద్రబాబు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ వైరం చివరకు వ్యక్తికత విషయాల మీదకు కూడా చేరుకుంది

వైసీపీ నేతలు తరచూ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేయడం, దానికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం లాంటివి రోజూ జరుగుతూ ఉంటాయి. మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. కానీ రాజకీయాలు ఎలా ఉన్నా… ఒకరినొకరు ఎదురుపడినప్పుడు కనీసం ఒకరి మొఖం ఒకరైనా చూసుకుంటారు. శత్రువైనా సరే ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించాలనేది పెద్దలు చెప్పే మాట. జగన్, చంద్రబాబుకు రాజకీయంగా తప్పితే వ్యక్తగతంగా ఏం లేవు. గతంలో చంద్రబాబు బర్త్ డే సమయంలో జగన్ విషెస్ చెప్పడం.. జగన్ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం లాంటి చోటుచేసుకునేవి.

గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ బర్త్ డే సందర్భంగా అసెంబ్లీలో నేరుగా జగన్ దగ్గరకు వెళ్లి చంద్రబాబు విషెస్ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. రాజకీయంగా ఎలాంటి విబేధాలు ఉన్నా.. ఒకరినొకరు ఎదురుపడినప్పుడు మాత్రం చిరునవ్వుతో పలకరించుకునేవారు. కానీ తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనేటీ విందుకు అన్ని పార్టీల నాయకులను, ప్రభుత్వ అధికారులను ఆహ్వానించారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్ తో పాటు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. చంద్రబాబు వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని ఉన్నారు.

అయితే జగన్, బాబు ఒకేచోట పక్కపక్కనే ఉన్నా… ఇద్దరు అసలు ఎదురుపడలేదు. ఒకేచోట ఉన్నా ఎదురుపడకుండా కూర్చున్నారు. తన సతీమణి భారతితో కలిసి జగన్ హాజరయ్యారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పవన్ హాజరుకాకపోవడానికి కారణాలు ఏంటనేది తెలియదు. పలువురు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రధాన టేబుల్ వద్ద సీఎం జగన్ దంపతులు, గవర్నర్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా దంపతులు కూర్చున్నారు. ఇక వేదిక ఎడమవైపు టేబుల్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు కూర్చున్నారు. ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన అతిధులను గవర్నర్ స్వయంగా వెళ్లి పలకరించారు. అతిధులు కూర్చున్న టేబుళ్ల దగ్గరకి స్వయంగా వెళ్లి పలకరించారు. అయితే జగన్, బాబు ఒకేచోట పక్కపక్కనే ఉన్నా.. కనీసం ఒకరినొకరు చూసుకోలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -