Jagan: జగన్ మంచోడే గొప్పోడే.. వాళ్ల వల్లే జగన్ మంచి పేరు పోతుందా?

Jagan: దేవుడు మంచోడైతే సరిపోదు పూజారి కూడా మంచోడు అయినప్పుడు దేవుడు ఇచ్చిన వరాలు ప్రజలకు చేరుతాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సామెత కరెక్ట్ గా రాజకీయ నాయకులకు సరిపోతుంది. ముఖ్యమంత్రి ఎంత మంచి వాడైనా కింద ఉన్నటువంటి మంత్రులు, సలహాదారులు కూడా మంచిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి మంచితనం ప్రజలలోకి వెళ్తుంది. అయితేప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇదే వ్యవహార శైలిలో నడుస్తున్నాయని తెలుస్తుంది.

ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే సంక్షేమ ఫలాలు తీసుకున్నటువంటి ప్రజలు మాత్రమే ఓట్లు వేస్తే సరిపోదు పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కూడా ఎంతో అవసరం.అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అనే వాదన వినిపిస్తోంది.చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా కార్యకర్తలకు రావడం లేదంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రజల సమస్యలకు ఆసరాగా ఈయన సంక్షేమ ఫలాలను అందిస్తూ వారిని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నారు. కానీ పార్టీకి కార్యకర్తలు కూడా ఎంతో ముఖ్యమని జగన్ గుర్తించినప్పటికీ కార్యకర్తల కోసం ఆయన అండగా నిలబడలేకపోవడంతో ఈయన వ్యవహార శైలి పట్ల కాస్త నిరుత్సాహం వ్యక్తం అవుతుంది. అయితే జగన్ గొప్పవాడే అయినప్పటికీ ఆయన ఆలోచనలు ప్రజల సంక్షేమం అభివృద్ధి అని తెలిసినప్పటికీ ఆయన చుట్టూ ఓ పెద్ద విషవలయం కమ్ముకుందని తెలుస్తోంది.

 

కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు కూడా జగన్ను కలిసే అవకాశాలు కూడా ఇవ్వలేదంటూ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు తమ గోడును వెల్లువిచ్చుకుంటున్నారు.జగన్ మంచివారే అయినప్పటికీ ఆయన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఆయన వరకు చేరలేదని చేరకుండా కొందరు అడ్డుకుంటున్నారని పలువురు వాదిస్తున్నారు.జగన్ కి సలహా ఇచ్చే వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆలోచన విధానాలను మార్చి వేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా సలహాదారులు వల్ల జగన్ కు ఉన్న పేరు కాస్త చెడిపోతుందని ఈ విషయాన్ని జగనన్న గుర్తించాలని పలువురు తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -