Liquor: మద్యం ఉద్యోగులకు జగన్ సర్కార్ భారీ షాక్.. ఏమైందంటే?

Liquor: జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధంగా షాక్ ఇస్తున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్క్ లో ప్రెజర్ పెరిగింది అంటూ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు గోల పెడుతున్నారు. ఇప్పుడు ఆ వంతు మద్యం ఉద్యోగులకు వచ్చింది. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల పొట్ట కొట్టేదిగా ఉండడం గమనార్హం.

ఇంతకీ విషయం ఏమిటంటే.. మద్యం దుకాణాల్లో పనిచేయాలంటే మూడు లక్షల డిపాజిట్ తో పాటు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పూచికత్తు కూడా ఉండాలట. ఈ నిబంధనకి మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులు కోపంతో రగిలిపోతున్నారు. అంత సొమ్మె ఉంటే ఇలాంటి చోట ఎందుకు పని చేస్తాం అంటూ నిరసన ప్రదర్శిస్తున్నారు.

 

ఇంకా బాధపడే విషయం ఏమిటంటే.. ఎంత త్వరగా డిపాజిట్ కట్టి పూచికత్తు సమర్పిస్తారో అప్పటివరకు జీతాలు నిలిపివేస్తామని ఖరాఖండీగా చెప్పింది జగన్ ప్రభుత్వం. ఇలా చేయటం వల్ల స్థానిక షాపుల్లో పనిచేసే కార్మికుల చేతివాటం తగ్గుతుందన్నది ప్రభుత్వ వాదన. ప్రస్తుతం మద్యం షాపుల్లో నగదు స్వాహా తో పాటు కొన్ని షాపుల్లో మద్యం మాయమవడంపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

 

ఆంధ్రప్రదేశ్ లో 2,934 మద్యం షాపులు మరో 800 వరకు వాక్ ఇన్ స్టోర్స్ ఉన్నాయి. 14,000 మంది వరకు వివిధ రకాల కేటగిరీలో ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. తరచూ ఏదో ఒక జిల్లాలో ఉద్యోగులు నగదుని న్యాయం చేస్తున్నారని అందుకే ఇలాంటి ఒక నియమం పెట్టామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇలా ఉద్యోగస్తుల పొట్ట కొట్టే బదులు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఈ సమస్య ఉండదు. కానీ ఎందుకు ప్రభుత్వం అందుకు సముఖంగా లేదు. కొసమెరుపు ఏమిటంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మె చేస్తామంటున్నారు ఉద్యోగ నేతలు. చూడాలి మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -