Kajal Aggarwal: అవి తగ్గించుకుంటేనే కాజల్‌కు సినిమా ఛాన్స్‌.. ఆ డైరెక్టర్‌పై అభిమానులు ఫైర్‌!

Kajal Aggarwal: చందమామ సినిమా నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్‌ అగర్వాల్‌ తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. అందుకే ఆమెను చాలా మంది చందమామ అని పిలుస్తుంటారు. కాజల్‌ ముఖం సైతం చందమామలా ఉంటుందని సినీ రంగంలో కూడా అంటుంటారు. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్న కాజల్‌ డేట్స్‌ ఖాళీగా ఉండేవి కాదు. కాజల్‌ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారులో జోష్‌ మొదలయ్యేది. డైరెక్టర్‌ ఏ కొత్త సినిమా గురించి ఆలోచించినా హీరోయిన్‌ను సెలెక్ట్‌ చేయడంలో మొదటగా కాజల్‌ పేరును ఎంచుకునేవారు. చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, నేనే రాజు నేనే మంత్రి వంటి చాలా సినిమాల్లో చేసింది. స్టార్‌ హీరోలందరితో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం కాజల్‌ పెళ్లి చేసుకుని దాదాపుగా రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంది. తన కెరీర్లో అవకాశాలు తగ్గుతున్నాయని వార్తలు వస్తుండగా వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన మిత్రబింద కొన్ని నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్‌ తన బాబు భర్తతో ఆనందంగా గడపుతోంది. అయితే.. తాజా కాజల్‌కు సంబంధించిన ఓ వార్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కాజల్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. శంకర్‌ డైరెక్ట్‌ చేస్తున్న భారతీయుడు–2 సినిమాలో కాజల్‌ అవకాశం కొట్టేసిందని కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్‌ కాజల్‌కు సినిమా చాన్స్‌ ఇస్తానని చెప్పాడట. కానీ ఒక కండిషన్‌ పెట్టాడట. ముందుగా తన బుగ్గలతో పాటు బాడీలో ఫ్యాట్‌ నెస్‌ తగ్గించాలని చెప్పాడట. అవి తగ్గిస్తేనే సినిమా ఛాన్స్‌ కష్టమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో కాజల్‌ అభిమానులు ఆ డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ టైంలోనే ఆగ్రహీరోలతో నటించి మెప్పించిన కాజల్‌ను ఇలా అవమానించడం సరికాదంటే కామెంట్లలో డైరెక్టర్‌ను హెచ్చరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -