Kamareddy Collector: వైరల్ అవుతున్న కామారెడ్డి కలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kamareddy Collector: ప్రస్తుత రోజుల్లో చాలామంది విద్యార్థులు, యువత చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురై ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లవ్ ఫెయిల్ అయ్యిందని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని ఇలా ప్రతి చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల విడుదలైన పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాము అని చాలామంది విద్యార్థులు బాధను ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయం పై కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించారు. తన జీవితంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తేనో, ఫెయిల్ అయితేనో నిరుత్సాహపడకూదు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు. జీవితంలో ఎన్నో సువర్ణావకాశాలు వస్తాయని వాటిని అందుకుంటూ జీవితంలో రాణించాలి అని విద్యార్థులకు సూచించారు. సమాజంలో మనకంటే ఎక్కువ బాధలున్నవారు కూడా ఉన్నారని వారితో పోల్చుకుంటే మనం పడే ఇబ్బందులు చాలా తక్కువే అని ఆయన తెలిపారు.

 

అంతేకానీ అద్భుతమైన ఈ మానవ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవద్దని తెలిపారు. నేను కూడా జీవితంలో ఎత్తుపల్లాలు చూశానని, ఐఎఎస్ కు ప్రిపేర్ అయి యూపిఎస్సీ పరీక్షలు రాసినపుడు నేను కూడా మొదటి సారి ఫెయిలయ్యాను. రెండవసారి ప్రయత్నించి ఐఎఎస్ సాధించాను అని చెప్పుకొచ్చారు. అలాగే విద్యార్థులు కూడా మార్కులు తక్కువగా వచ్చాయని, ఫెయిల్ అయ్యామని నిరుత్సాహపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని ఆయన తెలిపారు. మీ అభిరుచులకు తగ్గట్టుగా ఏరంగంలో అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రంగాన్ని ఎంచుకుని రెట్టింపు ఉత్సాహంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -