Kavya Kalyan Ram: ఆ పార్ట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కావ్య కళ్యాణ్ రామ్.. ఏం జరిగిందంటే?

Kavya Kalyan Ram: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే హీరోయిన్స్ చాలా అందంగా నాజుగ్గా ఉంటేనే వారికి సినిమా అవకాశాలు వస్తాయి అలాకాకుండా హీరోయిన్స్ కాస్త బొద్దుగా కనుక మారితే వారి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పటికే బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా బహిరంగంగా తెలియజేశారు.

 

ఇకపోతే బాలనటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మసూద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె బలగం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కావ్య కూడా చూడటానికి కాస్త బొద్దుగా ఉంటారు. ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి ఈమె ఒకానొక సందర్భంలో బయట పెట్టారు.

ఈ సందర్భంగా కావ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎంతో మంది డైరెక్టర్లు తనని మొహం మీదే నా బాడీ ఫిజిక్ గురించి మాట్లాడుతూ తనని కామెంట్ చేశారు అంటూ ఈమె తెలియజేశారు. ఇలా తన పట్ల బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదురయ్యాయని తెలియజేసిన ఈమె ఆ దర్శకుల పేర్లు మాత్రం బయట పెట్టలేదు.ఇక ఆరోజు ఎవరైతే తనని ఎగతాళి చేశారో వారి ముందే గొప్ప హీరోయిన్ కావాలన్నా కసి పట్టుదల తనలో పెరిగాయని కావ్య తెలిపారు.

 

ఈ విధంగా అదే పట్టుదలతో తనకు జరిగినటువంటి అవమానాలని సోపానాలుగా చేసుకుని ఈమె ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్, ఇండస్ట్రీలో కొత్తేంకాదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క కాస్త బొద్దుగా మారడంతో తన పట్ల కూడా ఇలాంటి విమర్శలు ఎన్నో వచ్చాయి. ఈ విధంగా బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొన్న వారి జాబితాలో నటి కావ్య కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -