Lady Comedians: ఫ్యామిలీ కోసం పెళ్లిని పక్కన పెట్టిన లేడీ కమెడియన్లు.. దీనస్థితిలో?

Lady Comedians: టాలీవుడ్‌లో కమెడియన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కామెడీతోనే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. మేల్ కమెడియన్లు రాణిస్తున్న ఇండస్ట్రీలో.. తమకేం తక్కువ అన్నట్లు లేడీ కమెడియన్లు పోటీ పడ్డారు. అలా వారు కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కోవై సరళ, శ్రీలక్ష్మి, గీతా సింగ్, ఝాన్సీ వంటి వారు టాలీవుడ్‌లో కమెడియన్లుగా రాణిస్తున్నారు. అయితే సినిమాల్లో తమ నటనతో కడుపుబ్బా నవ్వించినా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ కష్టాల వల్ల పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి లేడీ కమెడియన్లు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

 

కోవై సరళ..

టాలీవుడ్‌లో లేడీ కమెడియన్ లిస్ట్ లో కోవై సరళ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. బ్రహ్మానందం-కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న కోవై సరళ.. ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. తమ తోడబుట్టిన వాళ్లందరినీ సెటిల్ చేయాలని కష్టపడుతూ.. తన గురించి తాను మరిచిపోయారు. ప్రస్తుతం ఆస్పత్రి ఇబ్బంది పడుతున్న చూసుకునే వారు లేరు.

 

శ్రీ లక్ష్మి..

హీరో అమర్‌నాథ్ కూతురు శ్రీలక్ష్మి. పేరుకే హీరో కూతురైనా.. పూట గడవడానికి ఎంతో శ్రమిస్తోంది. సినిమాల్లో కాస్త సెట్ అయిందనుకునే సమయానికి.. తండ్రి, తోబుట్టువులను కోల్పోయింది. దీంతో కుటుంబ బాధ్యతలు ఆమెపై పడ్డాయి. దీంతో శ్రీలక్ష్మి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటోంది.

 

గీతా సింగ్..

గీతాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే రాబట్టుకుంది. కాస్త సెటిల్ అయిందని అనుకున్న సమయంలో తన సోదరుడు మృతి చెందాడు. దాంతో తాను పెళ్లి చేసుకోకుండా సోదరుడి కుటుంబాన్ని చూసుకుంటుంది. అలాగే వీరితోపాటు కమెడియన్ రమాప్రభ, జయలలిత, ఝాన్సీ తదితరులు పెళ్లి చేసుకున్న విడాకులు తీసుకుని వారి వారి కుటుంబాన్ని చూసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -