Anchor Lasya: అది కనిపించేలా వీడియో షేర్ చేసిన లాస్య.. కొడుకుపై ప్రేమతో?

Anchor Lasya: బుల్లితెర స్టార్ యాంకర్లలో ఒకరైన యాంకర్ లాస్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. కొన్ని నెలల క్రితం లాస్య మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించగా హోలీ రోజున లాస్య మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసిన లాస్య అభిమానులు సంతోషించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లాస్య మగబిడ్డకు జన్మనివ్వడంతో లాస్య ఫ్యామిలీలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చీమ ఏనుగు జోక్స్ ద్వారా పాపులర్ అయిన లాస్య యాంకర్ రవితో కలిసి చేసిన టీవీ షోలు ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యాయి. రవి లాస్య మంచి జోడీ అని కామెంట్లు వినిపించాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో రవిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన లాస్య ఆ తర్వాత రవితో ఉన్న విభేదాలను దూరం పెట్టి పలు షోలలో కనిపించారు. యూట్యూబ్ ఛానల్ లో వీడియోల ద్వారా ఆమె అభిమానులకు మరింత దగ్గరయ్యారు.

లాస్య మంజునాథ్ సోషల్ మీడియా పోస్ట్ లో కొడుకు చేయి కనిపించేలా ఒక వీడియో తీసి షేర్ చేయగా ఆ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా లాస్యకు పేరుంది. లాస్య మంజునాథ్ దంపతులకు ఇప్పటికే ఒక కొడుకు ఉండగా మరోసారి కొడుకు జన్మించడంతో లాస్య హ్యాపీగా ఫీలవుతున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్4 లో లాస్య సందడి చేసిన సంగతి తెలిసిందే.

రాబోయే రోజుల్లో లాస్య టీవీ షోల ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఆమె మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. లాస్య భర్త మంజునాథ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. లాస్య బుల్లితెర షోలపై దృష్టి పెడితే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -