Lasya-Raj Tarun: లాస్య రాజ్ తరుణ్ మధ్య అలాంటి బంధం.. ఏమైందంటే?

Lasya-Raj Tarun: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా పరిచయమయ్యారు యంగ్ హీరో రాజ్ తరుణ్.ఇలా ఈ సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తద్వారా ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి.

ఇక రాజ్ తరుణ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసేవారు అయితే ఈయన కెరియర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవారు. ఈయనకు నటుడిగా ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయనకు దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవాలని కోరిక ఉంది. అయితే ఉయ్యాల జంపాల సినిమాలో అవకాశం రావడంతో తన ఆలోచనలను కూడా మార్చుకున్నారు. ఇకపోతే అప్పట్లో రాజ్ తరుణ్ యాంకర్ లాస్యతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి.

 

ఇలా నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయం గురించి తరచూ ప్రశ్నలు తలెత్తడంతో ఈ విషయంపై రాజ్ తరుణ్ కూడా ఫేస్ బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు లాస్యత పెద్దగా పరిచయం లేదని తనని కేవలం ఒకేసారి ఒక ఈవెంట్లో కలిశానని ఈయన తెలిపారు.ఇలా మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వచ్చే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన కొట్టి పారేశారు.అదే సమయంలోనే లాస్యకు పెళ్లి కూడా సెట్ కావడంతో లాస్య పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారని తెలిపారు.

 

ఇలా తనకు లాస్యకు మధ్య ఏదో ఉందంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈయన పూర్తిగా ఈ విషయాన్ని ఖండించారు.అయితే లాస్య మాత్రం మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లి చేసుకున్నటువంటి లాస్య ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా ఈమె తన చిన్న కుమారుడికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -