ఇంటి దగ్గర దింపుతామని మహిళను కారులో ఎక్కించుకుని.. ఏం చేశారంటే?

నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింద. ఒంటరిగ కన్పిస్తే చాలు.. క్రురంగా ప్రవర్తిస్తున్నారు. వాయువరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు జైలుకు పంపించినా వారిలో దుర్బుద్ధి మారడం లేదు. ఒంటరిగా నివాసముంటున్న ఓ మహిళపై కన్నెసిన దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పరిధిలో జరిగింది.

రాజ్‌కోట్‌ సమీపంలో నివసిస్తున్న ఓ మహిలకు 1993లో వివాహామైంది. గతంలోనే భర్తకు వివాహామైనట్లు తెలుసుకున్న మహిళ 1996 నుంచి విడివిడి ఉంటున్నారు. ప్రస్తుతం మహిళ తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. భర్త లేడన్న విషయం తెలుసుకున్న కొందరు ఆమెను తమ దారికి తెచ్చుకోవాలనే పన్నాగం పన్నారు. ఈ క్రమంలో అమ్రేలికి చెందిన మయూర్‌ కతిరియాతో సదరు మహిళకు పరియం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుండేవాడు.

ఇటీవల ఓ రోజు ఆటో కోసం ఎదురు చూస్తున్న ఆమె వద్దకు కారులో వెళ్లాడు.అప్పటికే అతడితో పాటూ అశోక్‌ పోపట్, ధంజీ, జగదీష్‌ కారులో ఉన్నారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఇద్దరితో కలిసి మొత్తం 6 మంది ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేస్తూ వీడియో కూడా తీశారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే వీడియో అందరికీ చూపిస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. తర్వాత ఆ దుండగులు ఆమెను సమీపంలోని బస్టాండు వద్ద దింపి అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. అతి కష్టం మీద పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న బాధితురాలు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -