Pawan Kalyan: ఆ నియోజకవర్గంపై కన్నేసిన పవన్.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేస్తారా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది జనసైనికుల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ తిరుపతి, పిఠాపురం, అవనిగడ్డ, భీమవరం పేర్లు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ పై ఓడిపోయారు. అయితే మళ్లీ భీమవరం నుంచి పోటీ చేసి అక్కడ గెలిచి సత్తా చాటాలను పవన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎక్కడైతే ఓడిపోయారో.. అక్కడే గెలిచి చూపించాలని పవన్ భావిస్తున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారని చాలామంది చెబుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి ఓడిపోవడంతో మళ్లీ పోటీ చేస్తే ప్రజల్లో సానుభూతి ఉంటుందని, అందుకే గెలిపించే అవకాశముందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇటీవల తిరుపతి నియోుజకవర్గంపై పవన్ ఫోకస్ పెట్టారు. గతంలో తిరుపతి నుంచి పీఆర్పీ తరపున చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఆ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల జనసేన బస్సు యాత్రను కూడా తిరుపతి నుంచి మొదలుపెట్టాలని పవన్ నిర్ణయించారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అటు పిఠాపురం నియోకవర్గాల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచిపవన్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. విశాఖ పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు. గతంలో పీఆర్పీ పార్టీ సమయంలో కూడా ఆ పార్టీకి విశాఖ జిల్లాలో బాగా ఓట్లు వచ్చాయి. విశాఖ జిల్లా నుంచి పీఆర్పీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అలాగే మరికొన్ని స్థానాలను చాలా తక్కువ మెజార్టీతో చేజార్చుకుంది.

ఇక గత ఎన్నికలలో కూడా జనసేన ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఓట్లను భారీగా సంపాదించుకుంది. దీంతో వచ్ే ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గం నంుచి పోటీ చేసేందుకు పవన్ కసరత్తలు చేస్తోన్నట్లు ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖపట్నం సిటీలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగా.,.. రెండో స్థానంలో వైసీపీ నెలిచింది. జనసేన అభ్యర్థులు కూడా మూడ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. 2009,2014,2019 ఎన్నికల్లో వరుసగా ఆయన గెలిచారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -