Messi: టీమ్‌కు మెస్సీ అదిరిపోయే సర్‌ప్రైజ్.. గిఫ్ట్‌గా గోల్డ్ ఐఫోన్లు!

Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ తన టీమ్‌, స్టాఫ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. టీమ్, స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్‌లను ఆర్డర్ చేశాడు. తన టీమ్ కోసం సపరేటుగా ఈ ఐఫోన్‌లను తయారు చేయించాడు. ఈ ఫోన్లపై ఆటగాడి పేరుతో పాటు జెర్సీ నెంబర్లు, అర్జెంటీనా లోగోను కూడా ముద్రించారు. ఈ గోల్డ్ ఐఫోన్లు చాలా ప్రత్యేకతను చాటుకున్నాయి. ఇటీవల ఫిపా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు కప్ సొంతం చేసుకుంది.


ఈ క్రమంలో అర్జెంటీనా ప్రపంచకప్ సాధించినందుకు గాను తోటి ఆటగాళ్లు, స్టాఫ్‌కు ఈ గోల్డ్ ఐఫోన్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని మెస్సీ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా తయారుచేయించాడు. బన్ లైన్స్‌ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌తో కలిసి ఈ ప్రత్యేక ఐఫోన్లను మెస్సీ తయారు చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బుక్ చేసిన వారం రోజుల్లో మెస్సీ ఇంటికి ఈ గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేశారు. దీంతో మెస్సీ రిసీవ్ చేసుకున్నట్లు ఐ డిజైన్ గోల్డ్ అనే సంస్థ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోన్ డిజైన్లతో పాటు ఐఫోన్లను షేర్ చేసింది. వరల్డ్ కప్ సాధించిందుకు అర్జెంటీనాతో టీమ్ కు గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. 35 గోల్డ్ ఐఫోన్లను మెస్సీ, అతడి టీమ్, స్టాఫ్‌కు అందించినట్లు స్పష్టం చేసింది.

ఐఫోన్ 14 మోడల్ ను ఇలా కొత్తగా మెస్సీ డిజైన్ చేయించాడు. ఇవి చూడటానికి చాలా బాగున్నాయి. వీటి ధర రూ.1.73 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా టీమ్ దాదాపు 36 ఏళ్ల తర్వాత పిఫా వరల్డ్ కప్ ను సాధించింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే ఫ్యాన్స్, అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ ను అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్ గా నిలిచింది. మ్యాచ్ ముగిసి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -