Navdeep: నవదీప్ ఇంటికి నార్కోటెక్ పోలీసులు.. డ్రగ్స్ కేసు వల్ల నవదీప్ కు ఇబ్బందులు తప్పవా?

Navdeep:  మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు హీరో నవదీప్ ఇంట్లో తాజాగా నార్కోటిక్ బ్యూరో సోదాలను నిర్వహించింది. అయితే పోలీసులు నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించే సమయంలో అతను ఇంట్లో లేడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మాదాపూర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్‌ పార్టీ తీగ లాగిన టీఎస్‌ నాబ్‌ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ విచారణలోనే నటుడు నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో నవదీప్‌ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు.

చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి డ్రగ్స్‌ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్‌ వినియోగదారుడిగా ఉన్నాడని అతడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్‌ మోషన్‌ రూపంలో నవదీప్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -