Political Surveys: ఏపీలో ఆ పార్టీదే అధికారం… జాతీయ మీడియా ఛానెళ్లు సంచలన సర్వే

Political Surveys: ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ ప్లాన్ లు రూపొందిస్తుండగా… గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ, జనసేన పార్టీలో వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్ కే లాభం జరుగుతుందని అంచనా వేసిన టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కదుర్చుకునేందుకు సిద్దమవుతున్నాయి. టీడీపీతో పొత్తుకు సిద్దమని పవన్ బహిరంగగా వ్యాఖ్యానించడం, చంద్రబాబు కూడా అలాంటి సంకేతాలు ఇవ్వడంతో.. వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

అయితే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఇప్పటినుంచే ఫోకస్ పెట్టాయి. బలమైన అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడ్డాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటు దక్కే అవకాశాలు లేవు. ఇక కొన్ని అసెంబ్లీ స్థానాల్లో సీటు కోసం ఇద్దరు,ముగ్గురు పోటీ పడుతున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీల్లో టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఇక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో జాతీయ మీడియా ఛానెళ్లు, సర్వే సంస్థలు ప్రజల నాడిని ఇప్పటినుంచే పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా విడుదలైన నేషనల్ మీడియా సర్వేలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజాగా విడుదలైన అన్ని సర్వేల్లోనూ వైసీపీ హవానే కనిపిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సర్వే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే చేపట్టగా.. ఇందులో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారి దక్కుతుందని, కాంగ్రెస్ కు సీట్లు పెరుగుతాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని, టీడీపీకి 7 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ఇప్పటికప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. వైసీపీకి 130కుపైగా సీట్లు వస్తాయని ఇండియా టుడే తన సర్వే రిపోర్టులో పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షంగా మళ్లీ టీడీపీ వస్తుందని, జనసేన ప్రభావం అంతగా ఉండదని అంచనా వేసింది.

ఇక తాజాగా విడుదలైన టైమ్ నై పిపుల్స్ పల్, ఇండియా టీవీ సర్వేలు కూడా అలాంటి ఫలితాలనే విడుదల చేసింది. ఏపీలో వైసీపీ హవానే నడుస్తుందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయమని తెలిపాయి. టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 16 నుంచి 18 ఎంపీ సీట్లు వస్తాయని తేలగా.. ఇండియా టీవీ సర్వే కూడా అ లాంటి ఫలితాలనే ఇచ్చింది. ఇలా జాతీయ మీడియా సర్వేలన్నీ జగన్ కే జై కొట్టాయి. దీంతో వైసీపీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, టీడీపీకి 6 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక అసెంబ్లీ ఎన్నికలు విషయానికొస్తే.. వైసీపీకి 133 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ సర్వే స్పష్టం చేసింది. ఇండియా టుడే, ఇండియా టీవీ సర్వే ప్రకారం.. దేశంలోనే టాప్ 10 సీఎంలలో జగన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ సర్వేలతో వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ వర్గాలు తేల్చేస్తున్నాయి. టీడీపీ మాత్రం ఈ సర్వేలను కొట్టిపారేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -