Nayanthara-Vignesh Shivan: ఆ ఒప్పందంతోనే నయనతార విగ్నేష్ ని పెళ్లి చేసుకుందట!

తెలుగు ప్రేక్షకులకు అందాల తార నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంబంధించింది. ఇక తన అందం తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

మొత్తానికి ఇండస్ట్రీలో నయన్ లేడీ సూపర్ స్టార్ గా.. నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం నయన్ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆరేళ్లపాటు ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండి.. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ ల పేరుతో ఫుల్ గా చిల్ అవుతున్నారు.

అక్కడ వాళ్ళు హగ్గులు, కిస్సుల తో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మొత్తానికి ఈ స్టార్ కపుల్స్ నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట గురించి ఒక చేదు వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే నయనతారకు పిల్లలకు జన్మనిచ్చే అదృష్టం లేదట. దానికి కారణం ఆమె ఆరోగ్య పరిస్థితి అని తెలుస్తుంది.

అయితే.. నయనతారకు మొదటినుంచి గర్భసంచి చాలా వీక్ అని తెలుస్తుంది. కనుక నయనతార గర్బం దాల్చడం చాలా కష్టమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఇక విగ్నేష్ శివన్ కు ఈ విషయం ముందే తెలుసట. వీళ్ళిద్దరూ పెళ్లి అయిన తర్వాత ఒక అనాధ పిల్లవాడిని పెంచుకుందామని ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారట. ప్రస్తుతం నయనతార పరిస్థితిని తెలుసుకున్న తన అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -