Nirmala Sitharaman: నిర్మలమ్మ బడ్జెట్ గురించి నెటిజన్ల దారుణమైన విమర్శలు.. ఏమైందంటే?

Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ నెల‌ల‌కు మధ్యంతర బ‌డ్జెట్‌ను తీసుకువ‌చ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈమె తీసుకువచ్చిన బడ్జెట్ వింటే కనుక మనకు అర్థమైన రీతిలోనే ఉన్నప్పటికీ పూర్తి కోణంలో విన్న అది ఎన్నికల తాయిలాల బ‌డ్జెట్ గానే భావిస్తోంది.

 

అన్ని వ‌ర్గాల‌కు మేలు చేస్తున్నామ‌ని చెబుతూ.. ప్ర‌క‌టించిన ఈ బ‌డ్జెట్‌లో నిజంగానే మేలు ప్ర‌క‌టించారు. ఈ బడ్జెట్లో అప్పులు రుణాలు వడ్డీ లేని రుణాలను సాయంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలు వస్తే కనుక ప్రజలందరికీ కూడా ఉచిత పథకాలను అమలులోకి తీసుకోవస్తారు కానీ నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన బడ్జెట్ కనుక గమనిస్తే అందరికీ కూడా పథకాలు అందుతాయి కానీ ఉచితంగా కాదని తేల్చి చెప్పారు.

ఈ మూడు మాసాల కాలానికీ రూ.47.66 ల‌క్ష‌ల కోట్లుగా ప్ర‌తిపాదించారు. దీనిలోనూ మొత్తంగా ఆదాయం.. అది ప‌న్నులు, సెస్సులు, సుంకాలు ఏవైనా కావొచ్చు.. రూ.30.80ల‌క్ష‌ల కోట్లుగా నిర్మ‌ల‌మ్మ పేర్కొన్నారు. ఇక ప్రజలకు పీఎం ఆవాస్ కింద ఇస్తున్నటువంటి రెండు లక్షల రుణాలు యధావిధిగా ఇస్తున్నారు. వాటిలో ఏ మాత్రం పెంపుదలలేదు అలాగే రుణాలకు వడ్డీలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేదు.

 

ఇక యువతులకు సరికొత్త ఉపాధి కల్పనలను ఏమాత్రం తీసుకురాలేదు ఉన్నవే చాలు అన్నట్టుగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంల‌ను ఏక‌రువు పెట్టారు. ఇక‌, రైతుల‌కు పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతార‌ని అంద‌రూ అనుకున్నారు కానీ పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని కూడా ఏమాత్రం పెంచకుండా ఇదివరకు ఇస్తున్న విధంగానే ఇకపై కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఎవరికి ఉచితంగా ఇవ్వడం లేదని ఉన్న పథకాలనే కొనసాగిస్తూ బడ్జెట్ తీసుకువచ్చారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -