Daggubati Purandeswari: పురందేశ్వరి ఫిర్యాదులకు కనీస విలువ ఇవ్వని బీజేపీ.. ఎన్టీఆర్ కూతురికి ఇలాంటి పరిస్థితా?

Daggubati Purandeswari: దగ్గుబాటి పురందరేస్వరికి బీజేపీ లో ప్రాధాన్యత తగ్గుతుందా.. ఎన్టీఆర్ కుమార్తెగా, యూపీఏ లో కేంద్ర మంత్రిగా ఆ తర్వాత బీజేపీ లో చేరిన పురందరేశ్వరి కి తొలినుంచి ప్రాధాన్యం ఇచ్చారు కానీ కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు అనేక ప్రచారాలు తెరమీదకి వస్తున్నాయి. పురందరేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె ఇచ్చే ఫిర్యాదులకి సైతం సరి అయిన విలువ ఇవ్వడం లేదు.

కేంద్రం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు, అన్నామలై డిఎంకె నేతల జాబితాను రెడీ చేసుకుని వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ ఉంటారు ఆ పవర్ ఆయనకి ఇచ్చారు కానీ పురందరేశ్వరి చేసే ఫిర్యాదుల్ని బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఆమెకు కాస్త కూడా హై కమాండ్ నుంచి సహకారం అందడం లేదనేది బాహటంగానే తెలుస్తుంది. మద్యం స్కాం గురించి పూర్తి వివరాలుతో లేఖ ఇచ్చారు భువనేశ్వరి. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతుందని ఆధారాలతో సహా బయటపెట్టారు, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు.

కానీ పట్టించుకున్న వారు లేరు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ వందల కోట్లలోనే ఉంటుంది కానీ ఏపీలో మాత్రం వేల కోట్లలో ఉంటుంది. మద్యం తయారీ, రవాణా అమ్మకం సహా మొత్తం వైకాపా నేతలు గుప్పెట్లోనే ఉంది. పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ డబ్బు ఎటు పోతుందో తేల్చాలి అన్న పురందరేశ్వరి ఫిర్యాదుని లెక్కలో తీసుకునేందుకు సిద్ధంగా లేరు నిర్మలా సీతారామన్. అప్పులు లెక్కలు తేల్చడం లేదు, విచారణకు ఆదేశించడం లేదు.

అంతేకాకుండా నిర్మల సీతారామన్ అప్పులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను పార్లమెంట్లో ప్రకటించి పురందరేశ్వరి పరువు తీశారు. ఈ విషయాన్ని పురందరేశ్వరి కూడా చెప్పుకొని బాధపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ నిర్వాకం వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడిందని చెప్పుకున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కూతురుకి ఇంతటి పరిస్థితా అని తమ బాధని వ్యక్తం చేస్తున్నారు అన్నగారి అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -