Newx Survey: ఒక్క ఛాన్స్ ను వినియోగించుకోలేక వైసీపీ ఓటమిపాలు.. 50 సీట్లు కూడా కష్టమేగా!

Newx Survey: అదృష్టం కొద్ది గతంలో భారీ మెజారిటీతో అధికారం లోకి వచ్చింది వైసీపీ. అయితే వచ్చిన అవకాశాన్ని జగన్ సరిగా ఉపయోగించుకోలేదని వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజలు తన నుంచి ఏమి కోరుకొని అధికారం కట్టబెట్టారో గ్రహించకుండా ఐదు ఏళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గతంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని జగన్ ఇప్పుడు రెండో ఛాన్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నారు. తాను అనుకోవడమే కాకుండా పార్టీలో అందరినీ అదే భ్రమలో ముందుకు నడిపిస్తున్నారు.

ఈసారి ఎన్నికలలో ఓటమి తప్పదని ముందే స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. జగన్ ప్రసంగాలలో ఇంతకు ముందు లేని అసహనం వినిపిస్తోంది, ప్రతిపక్షాలపై దాడులు కూడా ఓటమి భయంతో చేస్తున్నవే అని భావించవచ్చు. ఎందుకంటే రెండో ఛాన్స్ కష్టం అని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. నిజానికి సొంత సర్వేలు, ఐపాక్, నిఘా వర్గాలు కూడా ఈపాటికి అదే రిజల్ట్ చెప్పి ఉంటాయి. తాను చనిపోతానని ముందే తెలుసుకున్న వ్యక్తి కళ్ళలో కనిపించే భయం ఇప్పుడు జగన్ లో కనిపించడం గమనార్హం.

ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ సర్వేలో టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా కూటమి 18 సీట్లు, వైసీపీ ఏడు సీట్లు గెలుచుకోబోతుందని చెప్పింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే అనేక శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉంటాయి కాబట్టి శాసనసభ ఫలితాలు లోక్ సభ ఫలితాల కి అనుగుణంగానే ఉంటాయి. ఇంకా చాలా మీడియా సర్వేలు ఈసారి ఎన్నికలలో కూటమి విజయం సాధించబోతున్నట్లు తేల్చి చెప్తున్నాయి.

ఈ సర్వేలన్నీ భోగస్ అని వైసీపీ కొట్టి పడేసినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అమరావతి రైతులు చివరికి సామాన్య ప్రజలు సైతం జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందనే విషయం అందరికీ తెలిసిందే. వాటి వ్యతిరేకతే ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణం కాబోతుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యర్థులను నిందించడం సరైన పద్ధతి కాదు. ఇది కేవలం స్వయంకృతాపరాధం అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -