Polavaram Project: పోలవరం వైపు ఒకసారి చూసి ఓటు వేయండి.. ఏపీలో ఇంత దారుణ పరిస్థితులా?

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు తద్వారా సాగునీటి కొరత రావడంతో రైతాంగం మొత్తం స్తంభించిపోయింది. అలాగే ఎలాంటి పరిశ్రమలు కూడా ఏపీకి రాకపోవడంతో నిరుద్యోగత కూడా బాగా పెరిగిపోయింది.

ఇలా ఐదు సంవత్సరాలపాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆంధ్ర ప్రజలు త్వరలోనే కోట్లు వేసి మరోసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎన్నుకోబోతున్నారు అయితే ఓట్లు వేసే ముందు రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఒక సారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రజలకు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేస్తే మంచిదని రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి

చంద్రబాబు నాయుడు హయామంలో ఉన్నప్పుడు దాదాపు పోలవరం పనులు 72% పూర్తి అయ్యాయి. ఇలా పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రీటెండర్ వేసింది. ఇలా తమకు అనుకూలంగా ఉన్నటువంటి మేఘ సంస్థలకు ఈ ప్రాజెక్టు అప్పచెపింది. అయితే ఈ ప్రాజెక్టుకు డ్యాములు కట్టిన అనుభవాలు పెద్దగా లేవనే చెప్పాలి.

ఇక ఈ ప్రాజెక్టు కోసం విడుదల అయినటువంటి నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు మళ్ళించారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయని చెప్పాలి. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయ్యి ఉంటే నేడు మన ఆంధ్రప్రదేశ్ హరితాంద్రప్రదేశ్ గా ఉండేదని చెప్పాలి. రైతులందరూ కూడా చక్కగా పంటలు పండించుకొని వ్యవసాయాన్ని కాపాడుకునేవారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఏదైనా దక్కింది అంటే అది పోలవరం ప్రాజెక్టు మాత్రమే అని చెప్పాలి అయితే ఈ రాజకీయ నాయకులు కుల పిచ్చి కారణంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వదిలేసారు అయితే ఈసారి ఓటు వేసే వారందరూ ఓసారి పోలవరం వైపు చూసి ఓట్లు వేయడం ఎంతో మంచిది అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -