Jagan Cheated Kapu Community: జగన్ కాపులకు చేసిన మోసాలు ఇవే.. రూ.10 వేల కోట్లు ఇస్తానని ఇంత మోసం చేశారా?

Jagan Cheated Kapu Community:  దగా.. మోసం.. వంచన ఇలా ఈ పేర్లన్నీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పర్యాయపదాలుగా వాడవచ్చు ఎంతో సౌమ్యడిగా అమాయకుడిగా నటించేటువంటి ఈయన ప్రతి ఆలోచనలో కూడా ప్రజలను మోసం చేయడం వారినీ వంచనకు గురి చేయడం నమ్మించి వారిని నట్టేట ముంచటంలో దిట్టా అని చెప్పాలి. గత ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గానికి ఎన్నో వరాల జల్లులు కురిపించారు.

ముఖ్యంగా కాపులకు తాను అధికారంలోకి వస్తే ఏకంగా 10,000 కోట్ల రూపాయలతో కాపు సామాజిక వర్గానికి మేలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు ఏ విధమైనటువంటి మేలు చేయకపోవడమే కాకుండా గతంలో ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్లను కూడా తొలగించి వారిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఉన్నతంగా ఎదగడానికి కూడా అవకాశాలు లేకుండా చేశారు.

గత టిడిపి ప్రభుత్వం కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయలతో కాపులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రాయితీతో రుణాలను అందజేశారు కానీ జగన్ వచ్చిన తర్వాత రాయితీ రుణాలను ఎత్తేస్తారు తద్వారా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే టిడిపి హయామంలో కాపులకు విదేశీ విద్య కానుక అంటూ ఒక పథకాన్ని చంద్రబాబునాయుడు తీసుకువచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తొలగించారు.

ఈ డబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 10 నుంచి ఐదు శాతం రిజర్వేషన్లను టిడిపి హయామంలో చంద్రబాబునాయుడు తీసుకురాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఐదు శాతం రిజర్వేషన్లను కూడా తొలగించారు. ఇలా గత టిడిపి హయాంలో కాపులకు జరుగుతున్నటువంటి లబ్ధిని సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా అడ్డుకున్నారు అయితే ప్రజలలో ఈయన పాలన పట్ల వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో కాపు నేస్తం అంటూ కాపు మహిళలకు నగదు రూపంలో వారి అకౌంట్లో డబ్బులను వేశారు. ఎన్నికలకు ముందు పదివేల కోట్లు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం కాపు నేస్తామంటూ 2000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని పెద్ద ఎత్తున మోసం చేశారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -