YS Jagan: జగన్ తప్ప ఎవరూ కష్టపడటం లేదా? అందుకే ఇలాంటి ఫలితాలా?

YS Jagan: రాజకీయాల తీరే వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఏ నాయకుడు ఆకాశానికి ఎగురుతాడో, ఏ నాయకుడు పడిపోతాడో అస్సలు లెక్క గట్టలేం. ఇదంతా ప్రజల దీవెనల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఏపీలో సంచలనం చోటుచేసుకుంది. ఇది అందరికీ బాగా తెలుసు. అదే జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించటం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలవటం సాధ్యమా అనే లెక్కలు వస్తున్నాయి.

 

దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కులం మీదనే ఓట్లు పడుతాయి. ప్రజల్లో చైతన్యం తక్కువనే చెప్పాలి. ఎందుకనే అంశాన్ని పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్కసారి చూస్తే చాలు. ఇక ఇది పక్కకు పెడితే.. వచ్చే ఎన్నికలు హోరా హోరీగా ఉండనున్నాయి. వై నాట్ 175 అనే స్లోగన్ పదే పదే జగన్ వినిపిస్తున్నారు. ఇదే సందర్భంలో అసలు 50 సీట్లు కూడా గెలువలేరని ప్రతిపక్షాలు అంటున్నాయి.

జగన్ సొంత సర్వేలు చాలానే ఉన్నాయి. వీటన్నిటిలో ఆయనకు నెగిటివ్ ఎక్కువగా వస్తుందనే సమాచారం తెలిసింది. మెున్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మూడు పట్టభద్రుల ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓడింది.
ఇది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది. అయితే వైసీపీ నాయకులు పనిచేయకనే ఇలా జరిగిందని అంటున్నారు. జగన్ తప్ప ఎవరూ పెద్దగా పార్టీ గెలుపుపై ఫోకస్ పెట్టటం లేదంటున్నారు. దీనివల్లే 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం జగన్ కు సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -